పవన్ నో చెప్పిన డైరెక్టర్ తో నితిన్..

  • IndiaGlitz, [Thursday,June 16 2016]

ప‌వ‌న్ నో చెప్పిన డైరెక్ట‌ర్ తో నితిన్.. ఓ మూవీ చేస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ ప‌వ‌న్ నో చెప్పిన ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే...సంప‌త్ నంది. ఏమైంది ఈవేళ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సంప‌త్ నంది తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. ఆత‌ర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ర‌చ్చ సినిమా తెర‌కెక్కించి ఘ‌న విజ‌యం సాధించాడు. రామ్ చ‌ర‌ణ్ ర‌చ్చ‌ ఆత‌ర్వాత సంప‌త్ నంది ఏకంగా ప‌వ‌ర్ స్టార్ తో సినిమా చేసే అవ‌కాశం ద‌క్కించుకున్నాడు.
అదే స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. అయితే..ఏమైందో ఏమో...ఆఖ‌రి నిమిషంలో సంప‌త్ నంది ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాడు. ఆత‌ర్వాత మాస్ రాజ ర‌వితేజ తో బెంగాల్ టైగ‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించి మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. మాస్ ని మెప్పించ గ‌ల ఈ ద‌ర్శ‌కుడితో నితిన్ ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం. మ‌రి..ఈ ప్రాజెక్ట్ చ‌ర్చ‌ల‌కే ప‌రిమితం అవుతుందో...లేక సెట్స్ పైకి వెళుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

రజనీ మాత్రమే ఇండియన్ సూపర్ స్టారట...

ఇండియన్ సినిమాలో ప్రస్తుతం రజనీకాంత్ మాత్రమే సూపర్ స్టార్ అని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అన్నాడు.

టాలీవుడ్ లో పనిచేయాలనుంది - ఇలియానా

నేను టాలీవుడ్ లో పనిచేయకూడదని ఎప్పుడూ అనుకోలేదు.నేను బాలీవుడ్ లోకి వెళ్లగానే నాకు ఇక్కడ నుండి అవకాశాలు రావడం మానేశాయి.

'అభినేత్రి'లో తమన్నా పాత్ర ఏంటంటే...

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘అభినేత్రి’లో నటించనున్న సంగతి తెలిసిందే.

40కోట్ల క్లబ్ లో నితిన్...

త్రివిక్రమ్ దర్శకత్వ మాయతో హీరో నితిన్ కు అఆ చిత్రం కెరీర్ బ్లాక్ బస్టర్ చిత్రమయ్యింది.

సినీ ఎంట్రీ ఇచ్చేస్తున్న హీరోయిన్ తమ్ముడు...

హీరోయిన్ అమలాపాల్ తెలుగు,తమిళంలో పలు చిత్రాల్లో నటించి డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ ను పెళ్లి చేసుకుంది.