close
Choose your channels

ప్లాప్ డైరెక్ట‌ర్‌తో నితిన్‌...

Sunday, March 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్లాప్ డైరెక్ట‌ర్‌తో నితిన్‌...

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో ఒక‌రైన నితిన్ ఇప్పుడు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో భీష్మ అనే సినిమా చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌కు వెళ్ల‌నుంది. కాగా.. ఈ సినిమా త‌ర్వాత నితిన్ ఓ ప్లాప్ డైరెక్ట‌ర్‌తో ప‌నిచేయబోతున్నాడ‌ట‌.

ఇంత‌కు ఆ ప్లాప్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకున్నారు.. ఒకప్పుడు, నితిన్‌కు గుండెజారి గ‌ల్లంత‌య్యిందే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్‌. గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమా త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో ఒక లైలా కోసం సినిమా చేశాడు విజ‌య్ కుమార్ కొండ‌.

ఆ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో.. విజ‌య్ కుమార్ కొండ‌తో మ‌రేవ‌రూ సినిమా చేయ‌లేదు. ఆ త‌ర్వాత విజ‌య్ కుమార్ కొండ ల‌వ్ మ్యారేజ్ చేసుకోవ‌డం.. కొన్ని కుటుంబ స‌మస్య‌ల కార‌ణంగా విజ‌య్ కుమార్ మ‌రో సినిమా చేయ‌లేక‌పోయాడు.

రీసెంట్ టైంలో నితిన్‌కు క‌లిసి ఓ లైన్‌ను వినిపించాడ‌ట‌. నితిన్‌కు కూడా లైన్ బాగా న‌చ్చ‌డంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడ‌ట‌. అంతా ఓకే అయితే మ‌రోసారి నితిన్‌తో విజ‌య్ కుమార్ కొండ సినిమా చేస్తాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.