close
Choose your channels

లొకేషన్ ఛేంజ్ చేసిన నితిన్..!

Tuesday, November 24, 2020 • తెలుగు Comments

లొకేషన్ ఛేంజ్ చేసిన నితిన్..!

నితిన్, కీర్తిసురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ సినిమా ఫైన‌ల్ ద‌శ షూటింగ్‌కు చేరుకుంది. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో రీస్టార్ట్ చేసిన సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. మిగిలిన ఫారిన్ షెడ్యూల్‌ను ఇటలీలో చిత్రీక‌రించాల‌ని మేక‌ర్స్ భావించారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా యూనిట్ ఇటలీ వెళ్ల‌లేదు. ఈ ప‌రిస్థితుల్లో తాజాగా చిత్ర నిర్మాత‌లు తమ ఆలోచ‌న‌ల‌ను మార్చుకున్నార‌ట‌. ఇట‌లీ నుండి దుబాయ్‌కి లొకేష‌న్ ఛేంజ్ చేశార‌ట‌. ఈ షెడ్యూల్‌లో రెండు పాట‌ల‌తో పాటు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించబోతున్నార‌ని స‌మాచారం. ఫారిన్ షెడ్యూల్ పూర్తయిన తర్వాతే సినిమా విడుదలపై ఓ క్లారిటీ రానుంది.

మ‌రో వైపు నితిన్ నెక్స్‌ట్ చేయాల్సిన సినిమాలు లైన్‌లో ఉన్నాయి. బాలీవుడ్ చిత్రం ‘అంధాదున్‌’ రీమేక్‌లో న‌టించ‌డానికి నితిన్ ఓ వైపు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ రీమేక్‌కు సంబంధించిన లొకేష‌న్ సెర్చ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇది కాకుండా చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ‘చెక్’ సినిమా చిత్రీకరణ కూడా ముగింపు దశకు చేరుకుంది. అన్నీ ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగితే 2021లో నితిన్ మూడు సినిమాల‌తో సంద‌డి చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz