నితిన్‌ 'చెక్'‌.. రీస్టార్ట్‌

  • IndiaGlitz, [Friday,October 16 2020]

హీరో నితిన్‌ కోవిడ్‌ ముందు వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అయితే కోవిడ్‌ ప్రభావంతో సినిమాల షూటింగ్స్‌ ఆగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్టార్స్‌ అందరూ క్రమంగా సినిమా షూటింగ్స్‌ను రీస్టార్ట్‌ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌లో 'రంగ్‌దే' సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన నితిన్‌, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ కోసం ఇటలీ వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం యూనిట్‌ వీసా వర్క్‌ జరుగుతోంది. ఇది కాస్త సమయం పట్టేలా ఉండటంతో, నితిన్‌ తన మూవీ కిట్టీలో ఉన్న 'చెక్‌' సినిమా షూటింగ్‌ను రీస్టార్ట్‌ చేశారు. శుక్రవారం నుండి 'చెక్‌' మూవీ షూటింగ్‌ ప్రారంభం అవుతున్నట్లు యూనిట్‌ ప్రకటించింది.

చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లాయర్‌ పాత్రలో నటిస్తుంటే, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హనీ ట్రాపర్‌ పాత్రలో నటిస్తుంది. సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్నఈ చిత్రం ఇప్పటికే డెబ్బై శాతానికి పైగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఏక కాలంలో రంగ్‌దే, చెక్‌ సినిమాలను పూర్తి చేసిన తర్వాత నితిన్‌ అంధాదున్‌ రీమేక్‌తో పాటు పవర్‌పేట సినిమాను షురూ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట.

More News

మరో సినిమాను ఖరారు చేసిన నాగశౌర్య

యువ కథానాయకుడు నాగశౌర్య వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. శుక్రవారం రోజున తన కొత్త చిత్రాన్ని నాగశౌర్య అనౌన్స్‌ చేశారు.

'మోసగాళ్లు'కు వెంకీ వాయిస్‌ ఓవర్‌

మంచు విష్ణు హీరోగా నటిస్తూ 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతోన్న చిత్రం ‘మోస‌గాళ్లు’.

ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పెంపు..

ఎల్‌ఆర్‌ఎస్ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం రాత్రి చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పత్రిక ప్రకటన విడుదల చేశారు.

కూకట్‌పల్లిలో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్..

హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్నేహం, ప్రేమ ముసుగులో యువతిని బర్త్ డే పార్టీకి రప్పించి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆకట్టుకునే పిక్స్.. కదిలించే సంఘటనలు..

మెగాస్టార్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. అవినాష్‌కి మోనాల్ టిఫిన్ తినిపిస్తుంటే... అమ్మ రాజశేఖర్ సెటైర్లు చాలా ఫన్నీగా అనిపించాయి.