close
Choose your channels

ద‌ర్శ‌కుడితో నితిన్ చ‌ర్చ‌లు

Sunday, December 16, 2018 • తెలుగు Comments

ద‌ర్శ‌కుడితో నితిన్ చ‌ర్చ‌లు

ఈ ఏడాది 'ఛలో' సినిమాతో స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌. ఈ యువ ద‌ర్శ‌కుడు నితిన్‌తో 'భీష్మ' సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం క‌థ స‌హా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి.

సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.నాగ‌వంశీ నిర్మించ‌నున్నారు. నిర్మించ‌నుంది. అలాగే మ‌రోవైపు త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన 'రాక్ష‌స‌న్‌' రీమేక్ హ‌క్కుల‌ను కూడా సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ‌ను ట్రాక్‌లో తేవ‌డానికి నితిన్ అత‌నితో చర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం సుధీర్ వ‌ర్మ .. శ‌ర్వానంద్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే నితిన్ సినిమాను మొద‌లు పెట్టే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. 

Get Breaking News Alerts From IndiaGlitz