ప్ర‌భాస్‌ను ఫాలో అవుతున్న నితిన్‌

  • IndiaGlitz, [Saturday,October 03 2020]

బాహుబ‌లితో ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్‌ను మ‌రో హీరో ఫాలో అవుతున్నాడు. ఇంత‌కూ ప్ర‌భాస్‌ను ఫాలో అవుతున్న హీరో ఎవ‌రో కాదు.. నితిన్‌. ఇంత‌కీ ఈయ‌న ప్ర‌భాస్‌ను ఏ విష‌యంలో ఫాలో అవుతున్నాడ‌ని అనుకుంటున్నారా? వివ‌రాల్లోకెళ్తే.. నితిన్, కీర్తిసురేశ్ జంట‌గా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం రంగ్ దే. ఈ సినిమా ఫైన‌ల్ ద‌శ షూటింగ్‌కు చేరుకుంది. మూడు వారాల షూటింగ్‌ను విదేశాల్లో చిత్రీకరించాల‌ని ముందుగా అనుకున్నారు. అయితే క‌రోనా కార‌ణంగా యూనిట్ ఇండియాలోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది.

షూటింగ్‌ల‌కు పర్మిష‌న్స్ దొరికిన త‌ర్వాత ముందుగా ప్ర‌భాస్ రాధేశ్యామ్ కోసం ఇటలీకి ఫ్ల‌యిట్ ఎక్కాడు. దీంతో నితిన్ అండ్ టీమ్ ఇప్పుడు ప్ర‌భాస్ టీమ్‌ను ఫాలో అవుతూ ఇటలీకి వెళ్ల‌బోతున్నార‌ట‌. మూడు వారాల పాటు అక్క‌డే చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంద‌ట‌. ఇందులో రెండు పాట‌ల‌తో పాటు కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించబోతున్నార‌ట‌. సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి. మ‌రో వైపు జీ 5 నుండి ఫ్యాన్సీ ఆఫ‌ర్ కూడా ఉండ‌టంతో నిర్మాత‌లు ఏం చేయాలా? అని ఆలోచిస్తున్న‌ట్లు కూడాటాక్ వినిపిస్తోంది.