close
Choose your channels

ఇది పాట కాదు.. మా ఎమోష‌న్ అంటున్న నితిన్‌

Friday, December 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇది పాట కాదు.. మా ఎమోష‌న్ అంటున్న నితిన్‌

`శ్రీనివాస క‌ల్యాణం` త‌ర్వాత ఏడాది పాటు ఖాళీగా ఉన్న నితిన్ ఇప్పుడు మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో భాగంగా ముందు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో `భీష్మ‌` అనే సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈసినిమాలో తొలి పాట‌ను విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ హీరో నితిన్ ట్వీట్ చేశాడు. `భీష్మ నుండి తొలి సాంగ్ డిసెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. ఇది మా ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ కాదు.. మా గీతం.. నా ఎమోష‌న్`` అని తెలిపారు నితిన్‌.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో విడుద‌లై మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. ఇప్పుడు పాట‌ల సంద‌డిని చిత్ర యూనిట్ మొద‌లెట్టేసింది. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు సినిమాను ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పాటు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను, కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాలో న‌టించ‌డానికి నితిన్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.