close
Choose your channels

నితిన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూశారా!?

Friday, February 14, 2020 • తెలుగు Comments

నితిన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూశారా!?

టాలీవుడ్‌ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’‌లో కుర్ర హీరో నితిన్ కూడా ఒకడన్న విషయం తెలిసిందే. అయితే.. మరికొన్ని రోజుల్లో ఆ జాబితా నుంచి బయటికొచ్చేస్తున్నాడు. ఎందుకంటే బ్యాచిలర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. ఇన్ని రోజులు సింగిల్‌గా ఉన్న నితిన్.. ఓ అమ్మాయితో మింగిల్ అయిపోతున్నాడు. ఇదివరకే ఇదిగో ఫలానా రోజు.. ఫలానా చోట నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు.. ఆ అమ్మాయి గురించి.. ఇలా పలు రకాలుగా పుకార్లు వచ్చాయి. అయితే ఆ పుకార్లన్నీ నితిన్ విషయంలో మాత్రం అక్షరాలా నిజమవుతున్నాయ్. పెళ్లికి సంబంధించి పూర్తి వివరాలను నితినే చెప్పేశాడు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడు..? నితిన్‌ పెళ్లాడబోయే ఆ అమ్మాయి ఎవరు..? వీళ్ల ప్రేమ ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా చిగురించింది..? అనే విషయాలను ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూసగుచ్చినట్లుగా చెప్పేశాడు. ఆ ఆసక్తికర విషయాలను మీరు తెలుసుకోండి.

ఇదీ నితిన్ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ!

నేడు ప్రేమికుల రోజు కావడంతో ప్రముఖులు, లవ్ బర్డ్స్ ఇచ్చే సర్‌ఫ్రైజ్‌లు ఎలా ఉంటాయో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. నితిన్ కూడా లవర్స్ డే రోజున అభిమానులు, సినీ ప్రియులకు తాను చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. ఇదిగో నితిన్ చేసుకోబోయ్ అమ్మాయి మరెవరో కాదు.. ‘శాలిని కందుకూరి’. అన్ని ప్రేమ కథల్లాగా.. నా కథలో మాత్రం ఎలాంటి మలుపులు లేవు. అంతేకాదు.. తొలి చూపులోనే లవ్‌లో పడిపోవటం.. మరీ ముఖ్యంగా పెద్దలు కాదనడం లాంటివేవి జరగలేదు. నాకు శాలిని ఎనిమిదేళ్లుగా తెలుసు. గత ఐదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నాం. శాలిని సొంతూరు హైదరాబాద్. యూకేలోని యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఆమె మాస్టర్స్ చేసింది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరం పరిచయం అయ్యాం. ఆ తర్వాత ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాం. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. పెద్దలకు చెప్పేశాం.. వాళ్లు మాకు ఎలాంటి అభ్యంతరం చెప్పుకుండా ఒప్పుకున్నారు’ అని నితిన్ తన ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీని చెప్పేశాడు.

వేడుకల పరిస్థితి ఇదీ..!

కాగా.. రేపు అనగా ఫిబ్రవరి-15న హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో ఘనంగా ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరగనుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానితులని సమాచారం. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో వివాహ వేడుక నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు కూడా అతి తక్కువ మందినే ఆహ్వానించారని.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఉంటుందని.. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే..  ఫిబ్రవ‌రి 21న ‘భీష్మ’ సినిమాతో నితిన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పెళ్లికి ముందు వస్తున్న ఈ సినిమా ఏ మాత్రం సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz