close
Choose your channels

రాజ్‌తరుణ్‌తో నిత్యామీన‌న్‌

Wednesday, May 8, 2019 • తెలుగు Comments

రాజ్‌తరుణ్‌తో నిత్యామీన‌న్‌

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ ఇప్పుడు దిల్‌రాజు బ్యాన‌ర్‌లో 'ఇద్ద‌రిదీ ఒక‌టే లోకం' సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాగా.. ఇప్పుడు కె.కె.రాధామోహ‌న్ నిర్మాణంలో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

వివరాల్లోకెళ్తే.. 'గుండెజారి గ‌ల్లంత‌య్యిందే' ఫేమ్ విజ‌య్ కుమార్ కొండ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. కె.కె.రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రంలో రాజ్‌త‌రుణ్ హీరో. అయితే హీరోయిన్‌గా నిత్యామీన‌న్ న‌టించ‌నుంద‌ట‌.

రీసెంట్‌గా ద‌ర్శ‌కుడు విజ‌య్‌కుమార్ కొండ ఆమెను క‌లిసి క‌థ‌ను నెరేట్ చేశాడ‌ట‌. నెరేష‌న్ న‌చ్చ‌డంతో నిత్యామీన‌న్ సినిమాలో న‌టించ‌డానికి ఆస‌క్తిగానే ఉంది. అగ్రిమెంట్స్‌పై సంత‌కం చేయాల్సి ఉంది. 

Get Breaking News Alerts From IndiaGlitz