నితిన్ త‌దుప‌రి చిత్రం ఇదేనా..

  • IndiaGlitz, [Saturday,January 30 2016]

నితిన్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌చిత్రం అ..ఆ. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాకృష్ణ నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...నితిన్ ఫాదర్ సుధాక‌ర్ రెడ్డి, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వినాయ‌క్...ఇటీవ‌ల స్పీడున్నోడు సినిమా సెట్స్ లో సంద‌డి చేసారు.

అయితే అఖిల్ సినిమా త‌ర్వాత వీరిద్ద‌రు ఇలా క‌ల‌సి స్పీడున్నోడు సెట్స్ కి రావ‌డం విశేషం. వినాయ‌క్... చిరు 150వ సినిమా త‌ర్వాత నితిన్ తో సినిమా చేయనున్నార‌ని టాక్. అఖిల్ సినిమా వ‌ల‌న వ‌చ్చిన న‌ష్టాల‌ను పూడ్చేందుకే నితిన్ తో వినాయ‌క్ మూవీ ప్లాన్ చేస్తున్నార‌ట నిర్మాత సుధాక‌ర్ రెడ్డి. త్రివిక్ర‌మ్ తో అ..ఆ సినిమా చేస్తున్న నితిన్ త్వ‌ర‌లో వినాయ‌క్ తో సినిమా చేస్తే నితిన్ రేంజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం.

More News

'స్పీడున్నోడు' సెన్సార్ పూర్తి

త‌మిళంలో శ‌శికుమార్ హీరోగా రూపొందిన చిత్రం ‘సుంద‌ర‌పాండ్య‌న్‌’. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా భీమ‌నేని శ్రీనివాస్ దర్శ‌క‌త్వంలో ‘స్పీడున్నోడు’గా  రూపొందింది.

ర‌జనీకాంత్‌కు కోర్టు నోటీసులు

నిన్న ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న ర‌జ‌నీకాంత్ నేడు కోర్టు నోటీసులు అందుకున్నాడు. రెండు ప‌రిస్థితులు అయినా ఏం చేద్దాం. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే చెన్నై గిండిలోని ఆశ్ర‌మ్ పాఠ‌శాల స్థ‌ల వివాదం న‌టుడు ర‌జ‌నీకాంత్‌ను కోర్టు మెట్లు ఎక్కిస్తుంది.

స‌ర్ధార్ సినిమాలో మెగాస్టార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు.

అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్ ఇద్ద‌రు ఇద్ద‌రే

అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్...ఈ ఇద్ద‌రికీ చాలా పోలిక‌లు ఉన్నాయి. అల్లు అర్జున్ మెగాస్టార్ డాడీ చిత్రంలో ఓ డాన్స్ మూమెంట్ తో ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.

సీక్వెల్ ప్లాన్ లో నాగ్

సీక్వెల్ ప్లాన్ లో నాగ్...అంటే ఇంత‌కీ ఏ సినిమాకి సీక్వెల్ అంటారా..? స‌ంక్రాంతికి రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి. నాగార్జున హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రాన్ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.