తీవ్ర తుపాను‌గా మారిన వాయుగుండం

  • IndiaGlitz, [Tuesday,November 24 2020]

వాయుగుండం తీవ్ర తుపాను‌గా మారింది. ఈ తుపానుకు నివర్ అనే పేరును పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. రాగల 12 గంటల్లో వాయుగుండంగా, తదుపరి 24 గంటల్లో తీవ్ర తుపానుగా నివర్ మారనుందని తెలిపింది.
ఈ నెల 25న సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది.

తుపాను తీరాన్ని దాటే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడు సహా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ అధికారులు హెచ్చరించారు. తుపాను కారణంగా కడల్లోర్, విల్లుపురం, పుదుచ్చేరి తదితర తీరప్రాంత జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు నీరు చొచ్చుకువచ్చే అవకాశం ఉందన్నారు.

తమిళనాడు తీరంలో ముందు జాగ్రత్త చర్యగా రెండు కొస్ట్ గార్డ్ నౌకలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అధికారులు మోహరించారు. నైరుతి బంగాళాఖాతంలో తుపాను‌గా మారిన తీవ్ర వాయుగుండం నివర్.. తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 65-85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఐఎండీ వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలను తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.

More News

ఏపీపై కేటీఆర్ కామెంట్.. ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటూ బీజేపీ నేత ఫైర్

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

బాలీవుడ్ స్టార్ట్స్‌ని వెనక్కి నెట్టేసిన సోనూసూద్..

సోనూ సూద్ రీల్ విలన్ కాస్తా.. కరోనా మహమ్మారి దేశంలోకి ఎంటర్ అవగానే రియల్ హీరోగా మారిపోయిన విషయం తెలిసిందే.

షూటింగ్‌కి సడెన్‌గా ప్యాకప్ చెప్పి వెళ్లిపోయిన శ్రుతిహాసన్..

అగ్ర‌హీరో క‌మ‌ల్‌హాస‌న్ కుమార్తెగా వెండితెర‌కు ప‌రిచ‌యమైనప్పటికీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి నటిగా శ్రుతిహాసన్ సొంత గుర్తింపును సంపాదించుకోగలిగింది.

పర్మిషన్ వచ్చేసింది... తెర తొలిగేదెప్పుడు?

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణలోని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు మార్చి 15 నుంచి మూత పడ్డాయి.

వారం తిరగక ముందే హారిక కొట్టిన దెబ్బకు.. నామినేషన్స్‌లో మోనాల్

‘రావే చేద్దాం దాండియా.. జర ఊగిపోదా ఇండియా’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. ఇక అభి చేసిన దోశలను బిగ్‌బాస్‌కు చూపించి మరీ సొహైల్ ఆట పట్టించడం చాలా ఫన్నీగా అనిపించింది.