నంద‌మూరి  హీరో చిత్రంలో జాయిన్ అయిన నివేదా థామ‌స్‌...

  • IndiaGlitz, [Tuesday,May 29 2018]

మ‌ల‌యాళ బ్యూటీ నివేదా థామ‌స్ ... నిన్నుకోరి త‌ర్వాత మరో సినిమాలో న‌టించ‌లేదు. సినిమాల నుండి కాస్త గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మ‌ళ్లీ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ సినిమాలో న‌టించ‌బోతున్నారు. ఈస్ట్‌కోస్ట ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు నిర్మించ‌బోయే ఈ సినిమాకు కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌కుడు.

ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా సెట్స్‌కి నివేదా థామ‌స్ జాయిన్ అయ్యింది. ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్‌గా షాలిని పాండే న‌టించ‌నుంది. క‌ల్యాణ్ రామ్ న‌టించిన 'నానువ్వే' చిత్రం ఈ నెల 14న విడుద‌ల కానుంది.