close
Choose your channels

'ఊపిరి'లో అవి లేవ‌ట‌

Tuesday, November 17, 2015 • తెలుగు Comments

సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించే  అంశాల‌లో పాట‌ల‌కి, పోరాట స‌న్నివేశాల‌కి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. అయితే ఈ ఫైట్ సీన్స్‌తో అస్స‌లు సంబంధం లేకుండా ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా రూపొందుతోంది. అదే 'ఊపిరి'. నాగార్జున‌, కార్తీ, త‌మ‌న్నా ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా.. క‌థ రీత్యా ఎలాంటి పోరాటాల‌కు తావు లేకుండా తెర‌కెక్కింద‌ట‌. ఎమోష‌న్స్ నేప‌థ్యంలో సాగే 'ఊపిరి'కి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.