నా తల్లిదండ్రులతో విభేదాలేమీ లేవు: పీవీ సింధు

  • IndiaGlitz, [Tuesday,October 20 2020]

తాను కొన్ని పనుల మీద కొద్ది రోజుల క్రితం లండన్ వచ్చానని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలిపారు. అయితే తను తన తల్లిదండ్రులతో గొడవ పడి లండన్‌కు వెళ్లినట్టు ఒక స్పోర్ట్స్ రిపోర్టర్ ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తున్నారని.. ఇలాంటి వాటి కారణంగా తన రిప్యుటేషన్ దెబ్బతింటుందని పీవీ సింధు పేర్కొంది. వెంటనే ఇలాంటివి ఆపకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని పీవీ సింధు హెచ్చరించింది. అలాగే తన కోచ్ పుల్లెల గోపిచంద్‌తో విభేదాలు వచ్చాయంటూ వస్తున్న వార్తలను సైతం ఆమె ఖండించింది.

‘‘జీఎస్‌ఎస్‌ఐతో పని ఉండి కొద్ది రోజుల క్రితం లండన్ వచ్చాను. నా తల్లిదండ్రుల అంగీకారంతోనే ఇక్కడకు వచ్చాను తప్ప మామధ్య గొడవలు ఉండి కాదు. నా కోసం తమ జీవితాన్నే త్యాగం చేసిన నా తల్లిదండ్రులతో నాకు సమస్యలు ఎందుకు ఉంటాయి? నాకు నా కుంటుంబంతో చాలా మంచి అనుబంధం ఉంది. అలాగే వారంతా ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలుస్తారు. ప్రతి రోజూ నేను నా ఫ్యామిలీతో టచ్‌లో ఉంటూనే ఉంటాను.

అలాగే అకాడమీలో ట్రైనింగ్ ఫెసిలిటీస్ గురించి కానీ.. నా కోచ్ గోపిచంద్‌తో కానీ నాకు ఎలాంటి విభేదాలూ లేవు. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ రిపోర్టర్ రత్నాకర్ గారు ఫాల్స్ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటివి రాసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి. ఆయన ఇకపై అలాంటి రాతలు ఆపకుంటే.. నేను ఆయనపై లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పీవీ సింధు ట్వీట్‌లో పేర్కొంది.

More News

లంకా దినకర్‌ను బీజేపీ నుంచి బహిష్కరించాలని సోము వీర్రాజు నిర్ణయం!

బీజేపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ గురించి తెలియని వారుండరు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు.

తమిళనాడు సీఎం పళనిస్వామికి కేసీఆర్ ఫోన్..

తెలంగాణ సీఎం కేసీఆర్.. తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు.

యాపిల్‌పై షియోమీ సెటైరికల్ వీడియో.. మిలియన్లలో వ్యూస్..

అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం యాపిల్‌పై చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ సెటైరికల్‌గా వీడియో విడుదల చేసింది.

తొలిసారి నామినేషన్స్‌లో అవినాష్..

మంచి జోష్ ఉన్న సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. నేటి షోలో నామినేషన్స్ జరిగాయి. ఇంతకు ముందు వారాలతో పోలిస్తే..

‘800’ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి..

శ్రీలంక మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్నారు.