మీ వాహనం మోడల్ అదైతే మాత్రం.. తిరుమలలో నో ఎంట్రీ..

  • IndiaGlitz, [Friday,November 06 2020]

తిరుమలలో వాహనాల మోడల్‌పై ఆంక్షలు విధించారు. తిరుమలతో పాటు.. ఘాట్ రోడ్లపై కాలం చెల్లిన వాహనాలకు అనుమతి నిరాకరించనున్నారు. తిరుమలలో ప్రమాదాలకు కారణాలను గుర్తించి.. నివారణకు అవసరమైన చర్యలను చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే తిరుమల అడిషనల్ ఎస్పీ ముని రామయ్య నిర్వహించిన మీడియా సమావేశంలో పాత వాహనాలపై నిషేధాన్ని విధిస్తున్నట్టు వెల్లడించారు. పదేళ్లు పూర్తి చేసుకున్న వాహనాలను ఇకపై తిరుమలకి అనుమతించేది లేదని మునిరామయ్య స్పష్టం చేశారు. పాతవి, ఫిట్‌నెస్ లేని వాహనాలపై తిరుమల ఘాట్ రోడ్లలో నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

2010 కంటే ముందు రిజిస్టరైన వాహనాలను తిరుమలకు తీసుకురాకూడదని మునిరామయ్య స్పష్టం చేశారు. ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించబోమని ఆయన వెల్లడించారు.
రెండో ఘాట్ రోడ్డులోని శ్రీవారి సహజ శిలా స్వరూపం కనిపించే ప్రదేశంలో వాహనాలు నిలిపేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆ ప్రదేశంలో భక్తులు వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తిరుమల క్షేత్రం నో హారన్ జోన్ కావడంతో భక్తులు తమ వాహనాల హారన్ మోగించకూడదని సూచించారు. వాహనాల హారన్ మోగించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జరిమానా విధిస్తామని ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు.

More News

గుడ్‌బై చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది: నాగ్

నాగార్జున టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఏసీపీ విజయ్‌ వర్మగా ఈ చిత్రంలో నాగ్ నటిస్తున్నారు.

`నార‌ప్ప` షూటింగ్ షురూ..

సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి,  వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో

పవర్ స్టార్ మెట్రో ప్రయాణం.. ఈ ఆసక్తికర విషయాన్ని గమనించారా?

జనసేన అధ్యక్షులు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు మొట్టమొదటి సారి మెట్రోలో ప్రయాణించిన విషయం తెలిసిందే.

హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేశారో...

మోటార్ వెహికల్ చట్టం 206కి కేంద్రం మార్పులు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలోనే మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది.

రెండో పెళ్లి చేసుకున్న తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్..

తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్ తాజాగా రెండోసారి పెళ్లి పీటలెక్కాడు. పంచాక్షరి, బావ, అహ నా పెళ్లంట వంటి తెలుగు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న నటుడు సామ్రాట్ రెడ్డి