హైదరాబాద్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ లేనట్టేనా?

  • IndiaGlitz, [Wednesday,July 01 2020]

హైదరాబాద్‌లో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతుండటంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించాలని భావించింది. రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి.. ఆపై అవసరమనుకుంటే కేబినెట్‌ను సమావేశపరిచి లాక్‌డౌన్ విధిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తే పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని తెలుస్తోంది. కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలో మాత్రం స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తే చాలని అధికారులు సూచించినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు కంటైన్‌మెంట్ జోన్టలో మాత్రమే లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారం కంటైన్‌మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీవీ ప్రకారం అత్యవసరమైతే తప్ప రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ ఎవరూ బయటకు రాకూడదు. అలాగే ఈ సమయంలో మెడికల్ షాపులు, ఆసుపత్రులను మాత్రమే తెరచి ఉంచేందుకు అనుమతించారు.

More News

'A' (AD ‌INFINITUM) టీజర్ కు విశేష స్పందన!

సరికొత్త థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన చిత్రం “A”. ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ల విడుదలతో ప్రేక్షకుల  అంచనాలను  పెంచుతుండటం ఆశ్చర్యంగా ఉంది,

న‌టుడిగా నాలో మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించిన చిత్ర‌మే ‘భాన‌మ‌తి రామ‌కృష్ణ‌’ - న‌వీన్ చంద్ర‌

‘అందాల రాక్ష‌సి’ నుండి న‌టుడిగా త‌న‌ను తాను కొత్తగా ఆవిష్క‌రించుకుంటూ వ‌స్తున్న న‌వీన్ చంద్ర హీరోగా స‌లోని లూథ్రా హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘భానుమ‌తి రామ‌కృష్ణ‌’.

వారెవరో నాకు తెలియదు.. ఫేక్ న్యూస్ ప్రచారం చెయ్యొద్దు: పూర్ణ

తనను, తన కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ షమ్నా ఖాసిం(పూర్ణ).. సినీ నటుడు ధర్మజన్ బోల్గట్టితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

చిరు సోద‌రి పాత్ర‌లో మ‌రోసారి ఆ సీనియ‌ర్ హీరోయిన్‌

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే.

మ‌హేశ్ కోసం భారీ సెట్‌!!

మాయదారి క‌రోనా అని సినీ జ‌నాలు క‌రోనా గురించి తెగ తిట్టుకుంటున్నారు. కోవిడ్ 19 ప్ర‌భావంతో బాగా ఇబ్బందులు ప‌డుతున్న రంగాల్లో సినీ రంగం ముందు వ‌రుస‌లో ఉంది.