అభిమానికి అన్యాయం జ‌రిగితే నో లాజిక్స్ అంటున్న‌ రామ్..

  • IndiaGlitz, [Thursday,January 07 2016]

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ నేను...శైల‌జ సినిమా గురించి ట్విట్ట‌ర్ లో...ఒక న్యూస్ ఛాన‌ల్ లో త‌ప్ప వ‌ర‌ల్డ్ వైడ్ నేను...శైల‌జ సినిమా చాలా బాగా ర‌న్ అవుతుంది. ఆద‌రిస్తున్న అంద‌రికీ థ్యాంక్స్ అని స్పందించిన విష‌యం తెలిసిందే. అంతే కాదు...నిర్మాతో ప్రొబ్ల‌మ్ ఉంటే త‌ప్పు రివ్యూ, పొలిటీషయ‌న్ తో ప్రొబ్ల‌మ్ ఉంటే త‌ప్పు న్యూస్. స్టాండ‌ర్ట్స్ మెయిటైన్ చేయాలి. స‌మాజానికి త‌ప్పుడు స‌మాచారం అందించకూడ‌దు అంటూ న్యూస్ ఛాన‌ల్ పై ఫైర్ అయ్యాడు ఎన‌ర్జిటిక్ హీరో. ఇది మొన్న‌టి విష‌యం.

లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే... ఆ న్యూస్ ఛాన‌ల్ నేను...శైల‌జ రివ్యూ ప్ర‌సారం చేసే టైంలో ఆ ఛాన‌ల్ లో ప‌నిచేసే న‌వీన్ అనే ఉద్యోగి నేను...శైల‌జ సినిమా బాగుంది. బాగున్నా సినిమాని బాగోలేద‌ని ప్ర‌సారం చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని యాజ‌మాన్యంతో వాదించాడ‌ట‌. న‌వీన్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించ‌డంతో పాటు ఉద్యోగం నుంచి తొల‌గించార‌ట‌. ఈ విష‌యాన్ని తెలుసుకున్న రామ్...న‌వీన్ నా సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడినందుకు ఉద్యోగం నుంచి తొలగించారు. ఎప్ప‌టి నుంచో న‌వీన్ నా అభిమాని అని తెలిసింది.

ఈ సంద‌ర్భంగా న‌వీన్ కి సారీ చెబ‌తున్నాను. ఛాన‌ల్ నిర్ణ‌యాన్ని గౌర‌విస్తాను. కానీ నా ఫ్యాన్స్ విష‌యానికి వ‌స్తే...మాత్రం లాజిక్స్ చూడ‌ను. కొత్త ఉద్యోగం దొరికే వ‌ర‌కు న‌వీన్ నా ఆఫీస్ కి వ‌చ్చి ప్ర‌తి నెల జీతం తీసుకోవాలి అంటూ ట్వీట్ చేసాడు రామ్. ఏది ఏమైనా అభిమానికి అన్యాయం జ‌రిగితే నో లాజిక్స్ అంటూ రామ్....ప్ర‌తి నెల జీతం ఇవ్వ‌డానికి ముందుకు రావ‌డం నిజంగా అభినందించ‌ద‌గ్గ విష‌యం.

More News

ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీతో వ‌స్తున్న త‌రుణ్‌

లవర్ బాయ్ అనగానే మనకు గుర్తుకొచ్చె పేరు తరుణ్ . ప్రేమకధా చిత్రాలతో తెలుగులో తనదైన మార్క్ క్రియేట్ చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో కొంత గ్యాప్ అనంతరం మళ్లీ మరో వైవిధ్యమైన లవ్ స్టోరీతొ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

నా రియ‌ల్ లైఫ్ లో ఆ...ఇద్ద‌రి ఆలోచ‌న‌లు క‌లిసున్న వ్య‌క్తినే కోరుకుంటా - హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి

అందాల రాక్ష‌సి సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నక‌థానాయిక లావ‌ణ్య త్రిపాఠి. ఆత‌ర్వాత దూసుకెళ్తా, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రాల్లో న‌టించిన లావ‌ణ్య‌.

'చంద్రకళ' సీక్వెల్ హక్కులు దక్కించుకున్న సర్వంత్రామ్‌ క్రియేషన్స్ ,గుడ్ సినిమా గ్రూప్

ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో ఆరణ్మనిగా... తెలుగులో చంద్రకళగా ఆ మధ్య విడుదలై సంచలనం విజయం సాధించిన సంగతి తెలిసిందే.

నాన్నకు ప్రేమతో బాలీవుడ్ సినిమాకు ఇన్స్పిరేషన్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నాన్నకు ప్రేమతో...'. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు.

సూర్య టైటిల్ ఫిక్సయింది....

తమిళ్ స్టార్ హీరో సూర్య హీరోగా దర్శకుడు హరి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ సీక్వెల్ సింగం పార్ట్ 3 ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు.