‘నో పెళ్లి...’ వీడియో సాంగ్‌లో సాయితేజ్‌తో పాటు వ‌రుణ్ తేజ్‌, రానా సంద‌డి

  • IndiaGlitz, [Monday,May 25 2020]

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌'. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాలో తొలి వీడియో సాంగ్ ‘నో పెళ్లి..’ను యువ కథానాయకుడు నితిన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సాంగ్‌లో సాయితేజ్‌తో పాటు వ‌రుణ్‌తేజ్, రానా కూడా సంద‌డి చేయ‌డం విశేషం.

సాంగ్ విడుద‌ల చేసిన త‌ర్వాత ‘‘సాయితేజ్ ఇచ్చిన గిఫ్ట్ చాలా బావుంది. ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌’ సాంగ్‌ను విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. అయితే నువ్వెన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో చూస్తాను. కొన్నిసార్లు చేసుకోవ‌డంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో కానీ,చేసుకోవ‌డం మాత్రం ప‌క్కా’’ అని నితిన్ తెలిపారు. ‘‘ఈ సాంగ్‌లో భాగం కావ‌డం చాలా ఫ‌న్‌గా అనిపించింది’’ అని వ‌రుణ్ తేజ్ తెలిపారు. ‘‘నా యూత్‌లో టంగ్ స్లిప్ అనొచ్చు సాయితేజ్‌’’ అని రానా అన్నారు.

మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించిన ఈ పాట‌ను రఘురామ్ రాయ‌గా.. అర్మాన్ మాలిక్ పాట‌ను పాడారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల‌పై నిర్మాత‌లు అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తారు. ఈ చిత్రానికి వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

More News

సినీ ఇండస్ట్రీకి గుడ్ బై.. యాంకరింగ్‌కు సై అంటున్న సురేఖా..!

సుమ కనకాల, ఉదయభాను, ఝాన్సీ.. బుల్లితెరను ఏలుతున్న రారాణులు.! టీవీ షోలతో తెలుగింట ప్రతి ఒక్కరికీ పరిచయమైన ఈ యాంకర్ల జాబితాలోకి తాజాగా మరో పేరు చేరబోతుందా..?

థియేటర్ల ఓపెనింగ్స్‌పై కేంద్ర మంత్రి కిషన్ క్లారిటీ..

కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌‌తో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్లు మూసివేసిన విషయం విదితమే.

జూన్-1న సీఎం జగన్‌ను చిరు కలవబోతున్నారా!?

జూన్-01న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్, టాలీవుడ్ పెద్దన్న చిరంజీవి కలవబోతున్నారా..? ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?

సోనూసూద్‌కు చేతులెత్తి నమస్కరించిన స్మృతీ ఇరానీ

కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు ప్రముఖులు తమ వంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చిన విషయం విదితమే.

చిరుకు అక్కగా రాములక్క.. జరిగేపనేనా!?

టాలీవుడ్ సీనియర్ నటి కమ్ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.