క్షమించండి.. రాజకీయాలొద్దు.. సినిమాలే ముద్దు!

అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన తప్పును తెలుసుకుని తన అభిమానులు, సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు.. రాజకీయాలొద్దు.. సినిమాలే ముద్దు అని మరోసారి బల్లగుద్ధి మరీ చెప్పాడు. కాగా.. ఇవాళ్టితో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యాక్షన్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం రిలీజై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందేజ. ఈ సందర్భంగా సినిమాలో నటించిన నటీనటులు పలు విషయాలను పంచుకున్నారు. బండ్ల కూడా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అంతేకాదు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసి అందర్నీ మరోసారి పలకరించాడు.

బాధపడుంటే క్షమించండి!

‘జీవితంలో కిక్ కావాలంటే ఒక్క సినిమానే అని నేను డిసైడ్ అయ్యా. నాకు సినిమానే జీవితం సినిమాయే ప్రాణం. నా 15 సంవత్సరాల వయస్సులో సినిమా ఇండస్ట్రీకి వచ్చా. నాకు రాజకీయాలు వద్దు సినిమాయే ముద్దు. నావల్ల నా మాటలు వల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరినీ క్షమించమని కోరుకుంటున్నాను..’ అని బండ్ల ట్వీట్‌లో రాసుకొచ్చాడు. అయితే.. ఈ ట్వీట్‌పై నెటిజన్లు చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గణేష్ గతంలో చేసిన కొన్ని కామెంట్స్‌ను కూడా ప్రస్తావిస్తున్నారు.