close
Choose your channels

గోపీచంద్‌కి నో రెమ్యున‌రేష‌న్‌?

Tuesday, November 5, 2019 • తెలుగు Comments

గోపీచంద్‌కి నో రెమ్యున‌రేష‌న్‌?

టాలీవుడ్ యాక్ష‌న్ హీరోగా పేరు సంపాదించుకున్న మ్యాచో హీరో గోపీచంద్‌కు ప్ర‌స్తుతం మార్కెట్ వేల్యూ లేకుండా పోయింది. ఆయ‌న గ‌త చిత్రం `చాణ‌క్య‌` బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస‌ర్ట్ కావ‌డంతో గోపీచంద్‌తో సినిమా అంటే నిర్మాత‌లు ఆలోచించుకుంటున్నారు. అందుకేనేమో చాణ‌క్య విడుద‌ల‌కు ముందు సీనియ‌ర్ నిర్మాత గోపీచంద్‌తో ఓ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించాడు. చాణ‌క్య ప్లాప్ కావ‌డంతో ఆయ‌న సినిమాను ఆట‌కెక్కించేశాడు.

ఇప్పుడు గోపీచంద్ ఏం చేయ‌లేక త‌న ఫోకస్‌ను సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయే సినిమాపై పెట్టాడు. త‌న సినిమా నిర్మాత‌ల‌కు లాభం సంగ‌తేమో కానీ.. న‌ష్టం రాకూడ‌ద‌ని అనుకున్న గోపీచంద్ ఓ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని సినీ వ‌ర్గాల్లో గుస గుస‌లు విన‌ప‌డుతున్నాయి. అందుకోస‌మ‌ని త‌న సినిమా నిర్మాణ ఖర్చులు త‌గ్గించుకోవాల‌ని భావించాడ‌ట‌. అందుకోస‌మ‌ని రెమ్యున‌రేష‌న్స్ లేకుండా సినిమా చేయాల‌ని అనుకున్నాడ‌ట‌. సినిమా విడుద‌లై స‌క్సెస్ అయిన త‌ర్వాత రెమ్యున‌రేష‌న్ తీసుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ని టాక్‌.

హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసి మ‌ధ్య‌లో విల‌న్‌గా మారి, త‌ర్వాత హీరోగా మారిన గోపీచంద్ మంచి విజ‌యాల‌ను ద‌క్కించుకున్నాడు. అయితే కొంత కాలంగా ఈ హీరోకి బాక్సాఫీస్ వ‌ద్ద హిట్స్ లేవు. ఇప్పుడు గోపీచంద్ త‌న ఆశ‌ల‌న్నీ సంపత్ సినిమాపైనే పెట్టుకున్నాడు. మ‌రి సంప‌త్ నంది ఏం చేస్తాడో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz