close
Choose your channels

మా టీమ్‌లో ఎవ్వరికీ కరోనా లేదు: ఆర్జీవీ

Saturday, July 4, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మా టీమ్‌లో ఎవ్వరికీ కరోనా లేదు: ఆర్జీవీ

బుల్లితెర నటీనటులతో పాటు కొందరు సినీ ప్రముఖులకు కూడా కరోనా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో మరికొందరికి కరోనా పాజిటివ్ అంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీమ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్ అని.. దీంతో ఆయన షూటింగ్‌ను నిలిపివేశారని ప్రచారం జరిగింది. దీనిపై ట్విట్టర్ వేదికగా వర్మ స్పందించారు.

తమ టీమ్‌లో ఎవరికీ కరోనా లేదని.. తమ షూటింగ్ నిర్విఘ్నంగా జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ‘‘మా టీమ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినందున మేము షూటింగ్ నిలిపివేశామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. మేము షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ కరోనా టెస్ట్ చేయించాం. అందరికీ నెగిటివ్ అని రిజల్ట్ వచ్చింది. మేము కరోనా నిబంధనలన్నీ స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నాం’’ అని వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వర్మ నాలుగు సినిమాలను ఏక కాలంలో తీస్తున్నారు. వీటికి సంబంధించిన షూటింగ్ మొయినాబాద్‌లో జరుగుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.