డైరెక్ట‌ర్ శంక‌ర్‌కి నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు

  • IndiaGlitz, [Monday,February 01 2021]

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌కి చెన్నై ఎగ్మోర్ మేజిస్ట్రేట్ మెట్రోపాలిటిన్ కోర్టుషాకిచ్చింది. నాబ్ బెయిల‌బుల్ వారెంట్‌ను ఇష్యూ చేసింది. అందుకు కార‌ణం తెలుసుకోవాలంటే ప‌ద‌కొండేళ్లు ముందుకు వెళ్లాలి. 2010లో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘రోబో’. సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా న‌టించాడు. సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ క‌థ‌ను త‌న‌దంటూ కొన్నేళ్ల క్రితం ప్ర‌ముఖ ర‌చ‌యిత అరుర్ త‌మిళ నంద‌న్ కోర్టులో కేసు వేశాడు. కేసును ప‌రిశీలిస్తున్న ఎగ్మోర్ మెట్రో పాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ కోరిన శంక‌ర్ నుంచి రెస్పాన్స్ లేక‌పోవ‌డంతో నాన్ బెయిల‌బుల్ వారెంట్‌ను జారీ చేసింది.

1996లో అరుర్ త‌మిళ్‌నంద‌న్ ఓ త‌మిళ మ్యాగ‌జైన్‌లో జిగుబా అనే క‌థ‌ను రాశాడు. ఆ క‌థ న‌వ‌ల రూపంలోనూ అచ్చ‌య్యింది. దాన్ని ఆధారంగానే చేసుకునే శంక‌ర్ రోబో సినిమాను చేశాడంటూ రైట‌ర్ త‌మిళ్ నందన్ కేసు వేశాడు. నాన్ బెయిల‌బుల్ జారీ చేసిన కోర్టు ఫిబ్ర‌వ‌రి 19కి వాయిదా ప‌డింది. రోబో సీక్వెల్‌లో 2.0 చిత్రం 2018లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మ‌రి త‌న‌పై కోర్టు జారీ చేసిన నాన్ బెయిల‌బుట్ వారెంట్‌పై శంక‌ర్ ఎలా స్పందిస్తారో చూడాలి. శంకర్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమాకు సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

More News

వైద్య విద్యార్థినిగా రకుల్..

ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో మంచి అవకాశాలతో దూసుకుపోతోతంది.

ఇప్పుడు నమితను చూస్తే షాక్ అవడం ఖాయం..

తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో బొద్దుగుమ్మ అనగానే గుర్తొచ్చే పేరు నమిత. కానీ ఇప్పుడు అలా అనడానికి వీల్లేదు.

మదనపల్లె ఘటన: సోషల్ మీడియా ఖాతాల సెట్టింగ్స్ ఎవరు మార్చారు?

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది.

'సితార ఎంటర్టైన్ మెంట్స్' 'నరుడి బ్రతుకు నటన' చిత్రం ప్రారంభం

ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజాకార్యక్రమాలు కథానాయికగా ‘నేహాశెట్టి‘  ఫిబ్రవరి 4 నుంచి 'నరుడి బ్రతుకు నటన'  చిత్రం రెగ్యులర్ షూటింగ్ 

‘ఎఫ్ ‌3’.. ఫ్యాన్సీ డీల్ పూర్తి

స్టార్స్ న‌టించే సినిమాల‌కు ఉండే క్రేజే వేరు. సినిమా సెట్స్‌పై ఉండ‌గానే బిజినెస్ పూర్త‌వుతుంది. ఇప్పుడు ఎఫ్ 3 విష‌యంలో అదే జ‌రిగింది.