ఆ హీరోయిన్‌లిద్దరికీ డ్రగ్సే కాదు.. సెక్స్ రాకెట్‌తోనూ సంబంధాలు..!

  • IndiaGlitz, [Wednesday,September 30 2020]

తీగ లాగితే డొంకంతా కదిలినట్టు బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో కేసు విచారణను చేపట్టిన ఎన్సీబీ అధికారులు నిర్వహించిన విచారణ.. బాలీవుడ్‌తో పాటు శాండల్ వుడ్, టాలీవుడ్‌లలో సైతం కల్లోలం రేపింది. అయితే శాండల్ వుడ్‌లో ముఖ్యంగా రాగిణి ద్వివేది, సంజనా గల్రానీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వారిని విచారించిన అనంతరం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

అయితే ఈ ముద్దుగుమ్మలిద్దరికీ సెక్స్ రాకెట్‌తో సైతం సంబంధాలున్నట్టు తెలుస్తోంది. రాగిణి, సంజనాలకు సంబంధించిన మొబైల్స్ నుంచి సీసీబీ అధికారులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారని శాండల్ వుడ్ టాక్. ఇద్దరి మొబైల్ ఫోన్లలోనూ సెక్స్ రాకెట్‌కు సంబంధించిన విషయాలు బయటపడినట్టు సీసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముద్దుగుమ్మల సెల్‌ఫోన్‌లలో బ్లూ ఫిల్మ్స్‌తో పాటు అభ్యంతరకమైన ఫోటోలు సైతం ఉన్నాయని టాక్.

బ్లూ ఫిలింస్‌కి సంబంధించి ఇద్దరూ ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ను నిర్వహిస్తున్నారని.. ఆ గ్రూప్‌ను ఇటీవలే తొలగించారని సైతం అధికారులు గుర్తించారు. ఇక తాజాగా రాగిణి, సంజన నడిపిన గ్రూప్‌తో సంబంధం ఉన్న వాళ్లందరికీ నోటీసులు పంపి విచారణ చేపట్టాలని సీసీబీ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఈ కేసు మరెన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాలి.