రామ్ చరణ్ కి అత్త కాదట

  • IndiaGlitz, [Friday,January 19 2018]

బుల్లితెర సంచ‌ల‌నం అన‌సూయ‌.. వెండితెర‌పైనా సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య సోగ్గాడే చిన్ని నాయ‌నా, క్ష‌ణం చిత్రాల్లో సంద‌డి చేసిన అన‌సూయ‌.. విన్న‌ర్ కోసం ప్ర‌త్యేక గీతంలో త‌ళుక్కున మెరిసింది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ రంగ‌స్థ‌లం, గాయ‌త్రి చిత్రాల‌తో బిజీగా ఉంది. వీటిలో గాయ‌త్రి ముందుగా విడుద‌ల కానుండ‌గా.. రంగ‌స్థ‌లం మార్చి 30న తెర‌పైకి రానుంది.

కాగా, రంగ‌స్థ‌లం చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌కి అత్తగా అన‌సూయ క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే.. తాజాగా ట్విట్ట‌ర్‌లో ఓ అభిమాని ఇదే ప్ర‌శ్న‌ అన‌సూయ‌ని అడ‌గ్గా ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని చెప్పింది. సినిమా ప‌రిశ్ర‌మ‌కి రాకముందు నుంచి సుకుమార్ అంటే అభిమానం ఉంద‌ని.. ఇప్పుడు ఆయ‌న చిత్రంలో న‌టించే అవ‌కాశం దొర‌క‌డం ఆనందంగా ఉంద‌ని ఆమె పేర్కొంది. అంతేకాకుండా.. చిత్ర క‌థానాయిక స‌మంత పెర్‌ఫార్మెన్స్‌ని ద‌గ్గ‌ర‌గా చూడ‌డం ఆనందంగా అనిపిస్తోంద‌ని చెప్పుకొచ్చింది అన‌సూయ‌.