close
Choose your channels

శ్రీకాంత్ కాదు.. ప్రకాష్ రాజ్

Friday, March 2, 2018 • తెలుగు Comments

శ‌తాధిక చిత్రాల న‌టుడు శ్రీ‌కాంత్‌.. ఇటీవ‌ల ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లోనూ క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య గోవిందుడు అంద‌రివాడేలే, స‌రైనోడు చిత్రాలలో ఆయ‌న చేసిన పాత్ర‌లు మంచి పేరును తీసుకువ‌చ్చాయి. అంతేగాకుండా, గతేడాది నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన యుద్ధం శ‌ర‌ణంలోనూ విల‌న్ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు శ్రీ‌కాంత్‌. ఇదిలా ఉంటే.. నితిన్ క‌థానాయ‌కుడిగా శ్రీ‌నివాస క‌ళ్యాణం పేరుతో దిల్ రాజు ఓ సినిమాని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

రాశి ఖన్నా, నందితా శ్వేత హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగా, ఇందులో రాశి ఖ‌న్నా తండ్రి పాత్ర కోసం చిత్ర యూనిట్ శ్రీ‌కాంత్‌ను సంప్ర‌దించిందట‌. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న నో చెప్ప‌డంతో.. ఇప్పుడా పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్ క‌నిపించే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది. కాగా, మార్చి 3న లాంఛ‌నంగా ప్రారంభం కానున్న శ్రీ‌నివాస క‌ళ్యాణం.. 23 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.