close
Choose your channels

జస్ట్ కన్ఫూజన్.. తరుణ్ కాదు.. రాజ్‌తరుణ్!

Tuesday, August 20, 2019 • తెలుగు Comments

జస్ట్ కన్ఫూజన్.. తరుణ్ కాదు.. రాజ్‌తరుణ్!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, లవర్‌బాయ్‌గా పేరుగాంచిన తరుణ్‌‌‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని.. అయితే మూడో కంటికి తెలియకుండా ఆయన వెంటనే మరో కారులో ఎంచక్కా వెళ్లిపోయారని సోషల్ మీడియా, వెబ్ మీడియా, కొన్ని టీవీ చానెళ్లలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తనకు ఏ ప్రమాదం జరగలేదని.. తాను సేఫ్‌గా ఇంట్లో ఉన్నానని తరుణ్ చెబుతున్నాడు. అంతేకాదు.. తరుణ్ తండ్రి చక్రపాణి కూడా అభిమానులు ఎవరూ కంగారుపడొద్దు.. ప్రమాదం జరిగినట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు.

కారు యాక్సిడెంట్‌లో ట్విస్ట్!

వాస్తవానికి రోడ్డు ప్రమాదం జరిగింది.. రాజ్‌తరుణ్‌కు అయితే.. అందరూ తరుణ్ అని భావించారు. పలు మీడియా సంస్థలు సైతం రాజ్‌తరుణ్ ని తరుణ్ చేసేశాయి.!. దీంతో అసలేం జరుగుతోంది అని అటు రాజ్ తరుణ్.. ఇటు తరుణ్ కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. అసలు విషయం ఏమిటంటే.. రోడ్డు ప్రమాదం జరిగింది తరుణ్ కాదు బాబోయ్.. రాజ్ తరుణ్‌కు. గత రాత్రి నుంచి హల్ చల్ చేస్తున్న ఈ వార్తపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌ నార్సింగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో హీరో రాజ్‌తరుణ్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిశితంగా పరిశీలించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా రాజ్‌తరుణ్‌గా గుర్తించారు.

ప్రమాదం ఎలా జరిగింది!

వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌‌లోని నార్సింగి అల్కాపురి దగ్గర రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లిన ఓల్వో కారు గోడను ఢీకొట్టింది. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్వల్ప గాయాలతో హీరో రాజ్‌తరుణ్‌ బయటపడ్డాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా రాజ్‌తరుణ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం తర్వాత కారులో నుంచి దిగి రాజ్‌తరుణ్‌ పరుగులు తీసినట్లు సీసీ ఫుటేజీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కారు వేగాన్ని అదుపుచేయలేక పోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు మీడియాకు వెల్లడించారు.

ఎందుకు పరిగెత్తినట్లు!?

అయితే ప్రమాదం జరిగిన తర్వాత రాజ్ తరుణ్ ఎందుకు పరుగులు తీశాడు..? మద్యం మత్తులో ఉండి అలా పరుగులు తీశాడా..? లేకుంటే భయపడి పరుగులు తీశాడా..? అంతేకాదు.. రాజ్ తరుణ్‌తో పాటు మరో నిర్మాత కూడా కారులో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి నిజానిజాలు తెలియాలంటే రాజ్ తరుణ్‌ మీడియా ముందుకు రావాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz