'నోటా' పబ్లిక్ మీట్..!!

  • IndiaGlitz, [Sunday,September 30 2018]

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ' నోటా' అక్టోబర్ 5 న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసాడు.. అందుకు విజయవాడ లో పబ్లిక్ మీట్ ఏర్పాటు చేసి సినిమా రేంజ్ ని మరింత పెంచాడు.. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, మెహ్రీన్ కౌర్ విచ్చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా కి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు..

మెహ్రీన్ మాట్లాడుతూ.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.. ఈ సినిమా లో నటించినందుకు చాల ఆనందంగా ఉంది.. ఈ సినిమా రిలీజ్ కోసం చాల వెయిట్ చేస్తున్నాను.. నేను అర్జున్ రెడ్డి ఫ్యాన్ ని.. విజయ్ దేవరకొండ తో నటించినందుకు చాల హ్యాపీ గా ఉంది.. ఎంతో కష్టపడే వ్యక్తి అయన.. నిజంగా ఇలాంటి హీరో ని నేను ఇంత వరకు చూడలేదు.. తెలుగు, తమిళంలో ఒకేసారి ఇద్దరం వస్తున్నాం.. తెలుగు నా కన్నా తల్లి లాంటిది... తమిళ్ లో కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను.. అన్నారు..

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. విజయవాడ కి చాల రోజుల తర్వాత వచ్చా.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత ఇప్పుడే వచ్చా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విజయవాడలో అందరికి ఇష్టమైనది.. సినిమా.. రాజకీయం.. అలాంటి ఈ సినిమా, రాజకీయాల్ని కలిపి వస్తున్న పవర్ ఫుల్ జబర్దస్త్ సినిమా నోటా.. ఈ సినిమా ద్వారా మీ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ని అందిస్తున్నామని చెప్తున్నాను.. అక్టోబర్ 5 న ఈ సినిమా వస్తుంది. ఇంకా నాలుగే రోజులు ఉంది. థియేటర్ లో కలుద్దాం.. చూద్దాం.. సినిమా ఎలా ఉంటుందో.. మంచి స్క్రిప్ట్ తో , పవర్ ఫుల్ డైలాగ్స్ తో వస్తున్న సినిమా నోటా..మా సినిమా ని అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.. బయట ఉన్నవాళ్ళని చూడలేకపోతున్నాను.. సారీ.. నెక్స్ట్ టైం ఇంకా పెద్ద హాల్ ఏర్పాటు చేస్తా.. ఇంత చిన్న హాల్ సరిపోదు.. క్షమాపణ చెప్తున్నాను.. అందరు జాగ్రత్తగా వెళ్ళండి.. అన్నారు..

More News

నేను పని చేసిన గొప్ప పది చిత్రాల్లో 'బేవ‌ర్స్' సినిమా ఉంటుంది - రాజేంద్రప్రసాద్

"ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ ఎన్నో చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

మ‌ళ్లీ బిగ్‌బాస్‌లోకి యంగ్ టైగ‌ర్‌?

బాలీవుడ్ నుండి తెలుగులోకి వ‌చ్చిన రియాలిటీ షో బిగ్ బాస్. రెండు సీజ‌న్స్‌ పూర్త‌య్యాయి.

బ‌న్ని స్క్రిప్టే ర‌వితేజ ద‌గ్గ‌ర‌కు...

ప్ర‌స్తుతం 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' సినిమాతో బిజీగా ఉన్న మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. త‌దుప‌రిగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

'స‌వ్య‌సాచి' టీజ‌ర్‌కి ముహుర్తం కుదిరింది?

'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'స‌వ్య‌సాచి'.

'2.0'లో ఐశ్వ‌ర్యా రాయ్‌

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ కాంబినేష‌న్‌లోరూపొందుతోన్న చిత్రం '2.0'. సైంటిఫిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం 'రోబో' చిత్రానికి సీక్వెల్‌.