close
Choose your channels

NOTA Review

Review by IndiaGlitz [ Friday, October 5, 2018 • తెలుగు ]
NOTA Review
Banner:
Studio Green
Cast:
Vijay Devarakonda, Mehreen Pirzada, Sathyaraj, Nasser, Yashika Anand, Anastasia Maslova, Sanchana Natarajan, Priyadarshi Pullikonda and M. S. Bhaskar
Direction:
Anand Shankar
Production:
KE Gnanavel Raja
Music:
Sam CS

NOTA Movie Review

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లోని యువ‌త‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇప్పుడు త‌మిళంలో కూడా `నోటా` చిత్రంతో అడుగుపెట్టాడు. సినిమా టైటిల్ వివాద‌స్పందంగానే ఉన్న‌ప్ప‌టికీ.. సినిమాలో నన్ ఆప్ ది అబౌవ్‌కు సంబంధించిన కంటెంట్ లేదు. అయితే వ‌ర్త‌మానంలోని రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను అద్దం ప‌డుతూ సినిమా తెర‌కెక్కింది. రాజ‌కీయాలంటే ఆస‌క్తి లేని ఓ యువ‌కుడు అనుకోకుండా ముఖ్య‌మంత్రి అయితే ఎలా ఉంటుంద‌నే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం `నోటా`. వ‌రుస విజ‌యాల హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి చేసిన బైలింగ్వువ‌ల్ ఇది. కెరీర్ స్టార్టింగ్‌లోనే పొలిటిక‌ల్ మూవీ చేయ‌డం ఓ ర‌కంగా సాహ‌స‌మే. మ‌రి విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు `నోటా` ఎలాంటి గుర్తింపు తెచ్చిందో తెలుసుకోవాంటే క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:

వాసుదేవ్ రావ్‌( నాజ‌ర్‌) ఎయిర్ కండీష‌న‌ర్ స్కామ్ కారణంగా.. కోర్టు కేసు ఎదుర్కోవాల్సి రావ‌డంతో ముఖ్య‌మంత్రిగా త‌న స్థానంలో త‌న కొడుకు వ‌రుణ్‌(విజ‌య్ దేవ‌ర‌కొండ‌)ను కూర్చోపెడ‌తాడు. త‌ను చెప్పిన‌ట్లే వినాల‌ని అంటాడు. ముందు వాసుదేవ్ రావ్ అనుకున్న‌ట్లే జ‌రుగుతుంటుంది. అయితే కేసులో ఆయ‌న‌కు జైలు శిక్ష ప‌డి ఢిల్లీ జైలుకి వెళ్లాల్సి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ మ‌హేంద్ర‌(స‌త్య‌రాజ్‌) ద్వారా ముఖ్య‌మంత్రి అంటే బాధ్య‌త అని తెలుసుకుని ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నుకుంటాడు. కొన్ని స‌మ‌స్య‌ల నుండి రాష్ట్రాన్ని తెలివిగా కాప‌డుకుంటూనే ప్ర‌తి ప‌క్షాల వేసే అడ్డుక‌ట్ట‌ల‌ను దాటుకుంటూ వెళుతుంటాడు. ఈలోపు ఢిల్లీ జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన వాసుదేవ‌రావ్‌పై బాంబ్ ఏటాక్ జ‌రుగుతుంది. గాయ‌ప‌డ్డ వాసుదేవ్ రావ్ కోమాలోకి వెళ్లిపోతాడు. దాంతో ముఖ్య‌మంత్రిగా పూర్తిస్థాయి బాధ్య‌త‌ల‌ను తీసుకుని.. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంటాడు వరుణ్‌. మ‌రో ప‌క్క త‌న తండ్రిపై జ‌రిగిన ఎటాక్ గురించి వివ‌రాలు సేక‌రిస్తాడు. త‌న తండ్రిపై జ‌రిగిన దాడికి... త‌న‌కు, త‌న కుటుంబ స‌భ్యుల‌కు, స‌న్నిహితుల‌ను ఎవ‌రో చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తుంది. అస‌లు వ‌రుణ్‌ని ఎవ‌రు చంపాల‌నుకుంటారు?  చివ‌ర‌కు వరుణ్ అన్ని స‌మ‌స్య‌ల‌ను ఎలా దాటుకుని ముందుకెళ‌తాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:

సినిమాకు మేజ‌ర్ ఎసెట్ విజ‌య్ దేవ‌రకొండ‌.. త‌న న‌ట‌న‌తో కాదు.. బాడీ లాంగ్వేజ్‌తో కూడా చ‌క్క‌గా న‌టించాడు. ముఖ్య‌మంత్రి కాక‌ముందు స్నేహితుల‌తో తిరిగే ఓ యువ‌కుడు.. ముఖ్య‌మంత్రిగా మారిన త‌ర్వాత త‌న బాడీ లాంగ్వేజ్‌లో మార్పు చ‌క్క‌గా తెలిసిపోతుంది. ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ రొటీన్ పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను తెర‌కెక్కించకుండా స‌మ‌కాలీన అంశాల‌ను ఆధారంగా చేసుకుని క‌థ‌ను రాసుకోవ‌డం ఎసెట్ అయ్యింది. ఇక శామ్ సి.ఎస్ నేప‌థ్య సంగీతం సినిమాలో స‌న్నివేశాల్లో డెప్త్‌ను పెంచింది.

మైన‌స్ పాయింట్స్‌:

పాట‌లు బాగా లేవు. తెలుగు డైలాగ్స్‌, హీరో లిప్స్‌కు సింక్ కుద‌ర‌నే లేదు. ఇక సినిమాలో పాటలు గురించి త‌క్కువగా మాట్లాడుకుంటే మంచిది. సీరియ‌స్‌గా సాగే క‌థ‌నాన్ని అవి ప‌క్క‌దోవ ప‌ట్టించేలా.. అస‌లు అర్థం కాన‌ట్లు ఉన్నాయి. ఇక కెమెరా ప‌నితనం గొప్పగా ఏమీ లేదు. క‌థ‌లో.. లాజిక్స్ మిస్ అయ్యాయి. స‌న్నివేశాల్లోని ఎమోష‌న్స్ ఒక‌ట్రెండు చోట్ల మిన‌హా ఎక్క‌డా క్యారీ కాలేదు.

స‌మీక్ష‌:

నోటా అనేది ఎన్నిక‌ల యంత్రంలోని ఓ ఆప్ష‌న్ కాబ‌ట్టి విడుద‌ల‌కు ముందు టైటిల్‌పై .. సినిమా ఓ రాజ‌కీయ పార్టీకి స‌పోర్ట్ చేసేలా ఉంద‌ని మ‌రొక‌రు కేసులు కూడా వేశారు. దీని వ‌ల్ల యాజ్ యూజువ‌ల్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకు కావాల్సినంత ప‌బ్లిసిటీ దొరికింది. ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ పొలిటికల్ నేప‌థ్యంలో రాసుకున్న స‌న్నివేశాలు.. త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత చ‌నిపోయిన త‌ర్వాత ఘ‌ట‌న‌ల‌ను ఇన్‌డైరెక్ట్‌గా తెలియ‌జేసేలా ఉన్నాయి. ముఖ్య‌మంత్రి కోమాలో ఉంటే పాత ఫుటేజ్‌లో మీడియాకు చూపించ‌డం.. ఎమ్మెల్యేల‌తో అవిశ్వాస తీర్మానం పెట్టిన‌ప్పుడు అంద‌రినీ రిసార్ట్స్‌కు త‌ర‌లించ‌డం ఇలాంటి స‌న్నివేశాలు చాలానే  ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌ర‌స్థితులను తెలియ‌జేసేలా ఉన్నాయి. కొన్ని సీన్స్‌లో ఎమోష‌న్స్‌ను బాగా క్యారీ చేశాయి. ఉదాహ‌ర‌ణ‌కు కూతుర్ని ఓ త‌ల్లి ధ‌ర్నాలో పొగొట్టుకున్న‌ప్పుడు వ‌చ్చే సీన్‌.. ఆ సీన్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌.. నేను రౌడీ సీఎం వ‌స్తున్నాన‌ని చెప్పు అంటే ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో చెప్పే సీన్‌.. ప్ర‌త్య‌ర్థ పార్టీ విజ‌య్‌పై ఆరోప‌ణ‌లు చేసిన‌ప్పుడు అత‌ను తెలివిగా త‌ప్పించుకునే స‌న్నివేశం.. ఇలా కొన్ని సీన్స్ బావున్నాయి. అయితే ఈ సీన్ `మ‌న‌లో ఒక‌డు` సినిమాలో ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ చేసిన సీన్‌లా ఉంటుంది. న‌చ్చ‌కుండా విదేశాల నుండి వ‌చ్చి అనుకోకుండా రాజ‌కీయాల్లో వ‌చ్చే ఎన్నారై పాత్ర‌ల‌ను భ‌ర‌త్ అనే నేను, లీడ‌ర్ వంటి సినిమాల్లో చూసేసిన‌వే. ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యే సీన్స్ ఒక‌ట్రెండు మిన‌హా పెద్ద‌గా ఏవీ క‌న‌ప‌డ‌వు. లాజిక్ మిస్ అయిన స‌న్నివేశాలున్న‌ట్లు ప్రేక్ష‌కుడికి సుల‌భంగా అర్థ‌మైపోతుంది. శామ్ సి.ఎస్ అందించిన పాట‌లు బాగా లేవు. అయితే నేప‌థ్య సంగీతం మాత్రం చాలా బావుంది. కెమెరా వర్క్ ఓకే.

బోట‌మ్ లైన్‌: `నోటా`.. విజ‌య్ దేవ‌ర‌కొండ మార్క్ ఆఫ్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌

Read NOTA Movie Review in English

Rating: 2.5 / 5.0

Showcase your talent to millions!!

Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE