జగన్ చెప్పలేదుగా అమరావతిపై ఆందోళన వద్దు!

  • IndiaGlitz, [Saturday,August 24 2019]

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తరలిస్తారని గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా మంత్రే ఈ ప్రకటన చేయడంతో రాజధాని రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే రాజధాని వ్యవహారాన్ని సువర్ణావకాశంగా తీసుకున్న టీడీపీ, బీజేపీ.. అధికార పార్టీపై దుమ్మెత్తి పోశాయి. అంతేకాదు.. మీడియా గొట్టాల ముందుకొచ్చిన తెలుగు తమ్ముళ్లు, కాషాయం నేతలు ఇష్టానుసారం మాట్లాడేశారు.

బీజేపీ అండగా ఉంటుంది!
తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీకి టాటా చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు రాజధాని ప్రాంత రైతుల బృందం సుజనాను కలిసింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్‌ ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు గనుక రైతులు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదన్నారు. ఈ పుకార్లపై న్యాయపరంగా జగన్‌ను కలవాలని రైతులకు ఆయన సూచించారు. రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.

నాకు గజం స్థలం కూడా లేదు!
‘ప్రకృతి సిద్ధంగా వచ్చే వాటిని మనం మార్చలేము.. అంతమాత్రాన రాజధానిని మార్చాల్సిన అవసరం లేదు. రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుందనే వ్యాఖ్యలు దురాలాచోనతో చేసినవిగానే కనిపిస్తున్నాయి. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. గతంలో రాజధానికి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏపీని ప్రత్యేకంగా చూడడం వల్లే రాజధానికి నిధులు వచ్చాయు. మోదీ, అమిత్‌షాలను సంప్రదించే సీఎం జగన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పిన దాంట్లో నిజం లేదు. రాజధానిలో నాకు గజం స్థలం కూడా లేదు అని ఈ సందర్భంగా సుజనా చౌదరి తేల్చిచెప్పారు.

More News

ఒకే ఏడాదిలో ఐదుగురి ఉద్దండులను కోల్పోయిన బీజేపీ

బీజేపీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2019 ఏడాదిలోనే ఎంతో మంది ఉద్ధండులను బీజేపీ కోల్పోవడం గమనార్హం.

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శివ కంఠమనేని ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌

శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్‌ హౌస్‌ సినీ మేజిక్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం. 2గా రూపొందుతోన్న నూతన సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో

రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలి: పవన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

జైట్లీ మరణం బాధాకరం.. జనసేనాని

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.

సరదాగా సెర్బియా వెళ్లిరా.. అంతా పోలీసులే చూసుకుంటారు!

తిరుమల ఆర్టీసీ బస్సులో అన్యమత ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.