MLC By-Elections: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో ఇరువురు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వీరి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానాల భర్తీకి సీఈసీ నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ పదవుల పదవీ కాలం నవంబర్ 30, 2027 వరకు ఉండనుంది.
ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు..
జనవరి 18- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
జనవరి 19- నామినేషన్ల పరిశీలన
జనవరి 22- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
జనవరి 29- పోలింగ్, కౌంటింగ్
ఇక 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు కౌంటింగ్ జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.
అయితే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యేలతో భారీ మెజార్టీ ఉంది. విడివిడిగా ఎన్నికలు జరిగి ఉంటే ఒక్క స్థానం బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లేది. కానీ ఒకేసారి ఎన్నికలు జరగనుండడంతో రెండు స్టానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో సీటు రాని నేతలతో పాటు ఓడిపోయిన నేతలు కూడా ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు.
వీరిలో జగ్గారెడ్డి, మధుయాష్కీ, మైనంపల్లి హన్మంత్‌రావు, అంజనీకుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజరుద్దీన్, అద్దంకి దయాకర్ వంటి సీనియర్ నేతలు ఉన్నారు. ఈ రెండు స్థానాలతో పాటు గవర్నర్ కోటాలో మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. మరి అధిష్టానం ఎవరికీ ఛాన్స్ ఇస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments