అఫీషియ‌ల్‌:  ఎన్టీఆర్ 30.. త్రివిక్ర‌మే ద‌ర్శ‌కుడు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై క్లారిటీ వ‌చ్చింది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్‌' సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు వినిపించాయి. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తాడ‌ని, కాదు..వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ అధికారికంగా సినిమాను అనౌన్స్ చేసింది.

ఎన్టీఆర్ 30వ సినిమాను త్రివిక్ర‌మ్ డైరెక్ట‌ర్ చేస్తున్నాడు. ఎప్ప‌టిలాగానే త్రివిక్ర‌మ్ సినిమాల‌ను నిర్మించ‌చే హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా నిర్మాణంలో భాగ‌స్వామిగా మార‌డం విశేషం. అంటే ఎస్‌.రాధాకృష్ణ‌, నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌లుగా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు జూన్ నెల‌కంతా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. తర్వాత‌నే ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళుతుంది. రీసెంట్‌గా అల వైకుంఠ‌పుర‌ములోతో భారీ హిట్ కొట్టిన త్రివిక్ర‌మ్.. ఎన్టీఆర్‌ను మ‌రోసారి డైరెక్ట్ చేయనున్నారు. ఇంత‌కు ముందు అర‌వింద‌స‌మేత సినిమా ..వీరి క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. జూన్ త‌ర్వాత ప్రారంభం కాబోయే ఈ సినిమా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుదల కానుంది.

More News

సూపర్‌స్టార్ రజనీ మోషన్ పోస్టర్ అదుర్స్...

‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ కార్యక్రమం డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం కానుంది.

12000 ఎకరాల్లో ఉన్న తెరికాడు రెడ్ డెసర్ట్ లో వెంకటేష్ 'నారప్ప'

వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం 'నారప్ప'. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన 'అసురన్‌'

'హిట్' లాంటి డిఫ‌రెంట్ సినిమాల‌ను మ‌రిన్నింటినీ నాని మ‌న‌కు అందించాలి: దిల్‌రాజు

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా

'స్క్రీన్ ప్లే' సినిమా ట్రైలర్ విడుదల!!

బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ అరుణకుమారి నిర్మించిన చిత్రం 'స్క్రీన్ ప్లే'. 'ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ' అన్నది ట్యాగ్ లైన్.

అరగంటలో బుల్లెట్ నేర్చుకున్న హీరోయిన్!

హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ నటన గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, రీతూ జంటగా నటించిన ‘పెళ్లి చూపులు’