close
Choose your channels

Jr NTR - Nayanthara: కవల పిల్లలకు తల్లైన నయనతార... 12 ఏళ్ల క్రితమే చెప్పిన ఎన్టీఆర్, ఈ ట్విస్ట్ 'అదుర్స్'గా..!!

Tuesday, October 11, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Jr NTR - Nayanthara : కవల పిల్లలకు తల్లైన నయనతార... 12 ఏళ్ల క్రితమే చెప్పిన ఎన్టీఆర్, ఈ ట్విస్ట్ అదుర్స్గా..!!

లేడీ సూపర్‌స్టార్ నయనతార- విఘ్నేష్ శివన్ జంట తల్లీదండ్రులైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు. గాడ్ ఫాదర్ మూవీ సూపర్‌హిట్ కావడం, ఇప్పుడు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు కావడంతో నయనతార దంపతులు సంతోషంగా వున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే ఇద్దరు పిల్లలకు తల్లైంది నయనతార. ఈ వ్యవహారం సినీ ప్రముఖులతో పాటు సాధారణ జనాన్ని కూడా విస్మయానికి గురి చేస్తోంది. ఈ సంగతి అటుంచితే.. ఈ విషయమై టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పేరు ట్రెండ్ అవుతోంది.

Jr NTR - Nayanthara : కవల పిల్లలకు తల్లైన నయనతార... 12 ఏళ్ల క్రితమే చెప్పిన ఎన్టీఆర్, ఈ ట్విస్ట్ అదుర్స్గా..!!

వైరల్ అవుతోన్న అదుర్స్ సినిమాలోని ఆ సన్నివేశం:

దీనికి జూనియర్‌కు ఏం సంబంధం అనే డౌట్ రావొచ్చు. అక్కడే వుంది అసలు సంగతి. నయనతారకు కవల పిల్లలు పుడతారని జూనియర్ ఎన్టీఆర్ ముందే చెప్పారట. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎన్టీఆర్- నయనతార జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అదుర్స్ సినిమాలో ఓ సన్నివేశం వుంటుంది. నయనతార స్విమ్ డ్రెస్ వుండగా ఆమె నడుము మడతలో పుట్టుమచ్చ చూసి.. ఆమెకు కవల పిల్లలు పుడతారని బ్రాహ్మాణుడి గెటప్‌లో వున్న జూనియర్ జోస్యం చెబుతారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నిజంగానే నయన్‌కి కవల పిల్లలు పుట్టడంతో నెటిజన్లు అదుర్స్ సినిమాలోని ఈ సన్నివేశాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇది యాదృశ్చికంగా జరిగిందా .. పైనున్న తథాస్తు దేవతలు అనుగ్రహించారో కానీ ఎన్టీఆర్ నోటి మాట మాత్రం బాగా ట్రెండ్ అవుతోంది.

Jr NTR - Nayanthara : కవల పిల్లలకు తల్లైన నయనతార... 12 ఏళ్ల క్రితమే చెప్పిన ఎన్టీఆర్, ఈ ట్విస్ట్ అదుర్స్గా..!!

జూన్ 9న విఘ్నేష్‌ను పెళ్లాడిన నయన్:

ఇకపోతే.. సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత నయనతార, విఘ్నేష్ శివన్‌లు ఈ ఏడాది జూన్‌ 9న చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొత్త జంట హనీమూన్ వెళ్లొచ్చింది. ఇద్దరూ మ్యారేజ్ లైఫ్ బాగా ఏంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా నయనతార సినిమాలు చేస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు.

Jr NTR - Nayanthara : కవల పిల్లలకు తల్లైన నయనతార... 12 ఏళ్ల క్రితమే చెప్పిన ఎన్టీఆర్, ఈ ట్విస్ట్ అదుర్స్గా..!!

చేతినిండా ప్రాజెక్ట్‌లతో నయనతార:

ఇటీవల ఆమె మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌లో నటించారు. ఈ సినిమా సూపర్‌హిట్ కావడం.. ఇప్పుడు ఇద్దరు కవలలకు జన్మనివ్వడంతో నయన్ ఫుల్ హ్యాపీగా వున్నారు. తనకు ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ఆమె అభిమానులకు థ్యాంక్స్ నోట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నయనతార ప్రస్తుతం సినిమాల్లో బిజీగా వున్నారు. తమిళం, మలయాళంతో పాటు హిందీలో బాలీవుడ్ కింగ్ ఖాన్ సరసన మరో సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.