close
Choose your channels

గ‌ణేశుడి పండ‌క్కి..!

Tuesday, August 21, 2018 • తెలుగు Comments

గ‌ణేశుడి పండ‌క్కి..!

ఎన్టీఆర్ న‌టిస్తున్న సినిమా `అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌`. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తోంది. ఈ సినిమా  షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇటీవ‌ల విడుద‌లైన తొలి టీజ‌ర్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. రాయ‌లసీమ యాస‌లో ఎన్టీఆర్ డైలాగులు కూడా చెప్పారు. ఆ విజ‌యాన్ని ఆస్వాదించిన చిత్ర యూనిట్‌కి ఇప్పుడు కొత్త ఐడియా వ‌చ్చింద‌ట‌. తార‌క్ ముందు పెడితే ఆ ఐడియాను తార‌క్ కూడా ఓకే చేశార‌ట‌.

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే వినాయ‌క చ‌వితిని పుర‌స్క‌రించుకుని సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌ల్ని హైలైట్ చేస్తూ ఓ టీజ‌ర్‌ను సిద్ధం చేస్తున్నారట‌. సో తార‌క్ అభిమానుల‌కు వినాయ‌క‌చ‌వితి నిజంగానే వేడుక‌ను తీసుకురానున్న‌ద‌న్న‌మాట‌. పూజా హెగ్డే నాయిక‌గా నటిస్తున్న సినిమా ఇది. ఇప్ప‌టికే సెట్లో సెల్‌ఫోన్లు తీసుకురాకూడ‌ద‌నే నియ‌మాన్ని పెట్టారు. సో హీరో, హీరోయిన్ల నుంచి అంద‌రూ దాన్ని ఫాలో అవుతున్నారు. ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇందులో రాయ‌ల‌సీమ శ్లాంగ్ కోసం పెంచ‌ల‌దాస్‌తో పాటు ప‌లువురి సాయం కూడా తీస‌కుంటున్నారు.