close
Choose your channels

ప‌వ‌న్ రికార్డ్ ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్

Monday, January 25, 2016 • తెలుగు Comments

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...సుకుమార్ తెర‌కెక్కించిన నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రం ఓవ‌ర్సీస్ మార్కెట్ లో రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుంది. బాహుబ‌లి, శ్రీమంతుడు త‌ర్వాత అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన మూడ‌వ చిత్రంగా నిలిచింది నాన్న‌కు ప్రేమ‌తో.. ఓవ‌ర్సీస్ లో ప్ర‌భాస్ బాహుబ‌లి 6 మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ట్ చేసి మొద‌టి స్ధానంలో ఉండ‌గా, ఆత‌ర్వాత మ‌హేష్ శ్రీమంతుడు సినిమా 2.89 మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూలు చేసి రెండ‌వ స్ధానాన్ని ద‌క్కించుకుంది.

ఆత‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించ‌ని అత్తారింటికి దారేది 1.89 మిల‌య‌న్ డాల‌ర్స్ వ‌సూలు చేసి మూడ‌వ స్ధానంలో ఉండేది. అయితే ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో...2 మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూలు చేసి మూడ‌వ స్ధానాన్ని ద‌క్కించుకుంది. దీంతో ఓవ‌ర్సీస్ లో ప‌వ‌న్ రికార్డ్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేసారు. మ‌రి..ఓవ‌ర్సీస్ లో ఎన్టీఆర్ రికార్డ్ ను ప‌వ‌న్ స‌ర్ధార్ తో బ్రేక్ చేస్తారేమో చూడాలి.