ఎన్టీఆర్ అంకితభావానికి ఫ్యాన్స్ ఫిదా

  • IndiaGlitz, [Friday,April 06 2018]

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించనున్న‌ చిత్రం 'ఆన్ సైలెంట్ మోడ్' (ప్రచారంలో ఉన్న పేరు). ఈ సినిమాకి ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్‌ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాకి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇంత‌కుముందు 'బృందావనం' చిత్రం కోసం ఏ విధంగానైతే స్టైల్‌గా కనిపిస్తూనే ఫిట్‌గా కనిపించారో.. అదే విధ‌మైన లుక్స్ ఉండేలా ఈ సినిమా కోసం కూడా ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నారని ఆ మ‌ధ్య వార్తలు వినిపించాయి. తాజాగా.. ఐపీఎల్ తెలుగు ప్రసారాలకు బ్రాండ్ అంబాసిడర్ హోదాలో.. ఆ ప్ర‌మోషన్‌లలో పాల్గొన్న‌ ఎన్టీఆర్‌ను చూసిన వారంతా ఆశ్చర్యపడ్డారు.

ఈ ప్ర‌మోష‌న్స్‌లో ఫిట్‌గా.. చాలా వరకు బరువు తగ్గినట్లు తార‌క్‌ కనిపించారు. త్రివిక్రమ్‌తో కలిసి చేయబోయే సినిమా కోసమే.. మూడు నెలల్లో 20 కిలోల వరకూ తగ్గానని.. మరింత బరువు కూడా తగ్గనున్నట్లు ఈ సమావేశంలో తెలియజేశారు యంగ్ టైగర్.

ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్‌కు వృత్తిపై ఉన్న అంకిత భావం ఎటువంటిదో గతంలో 'యమదొంగ' సినిమా విషయంలోనే తెలిసిందని.. ఇప్పుడు మరోసారి అది నిరూపితమైందని ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

More News

పాటల చిత్రీకరణలో 'నేల టిక్కెట్టు'

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో

డబ్బింగ్ ప్రారంభించిన కీర్తి సురేష్

న‌టీమ‌ణి సావిత్రి బ‌యోపిక్‌గా ‘మహానటి’ సినిమా తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే.

వెంకటేష్‌కే.. ఎందుకిలా?

విజయాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీనియ‌ర్‌ హీరో విక్ట‌రీ వెంకటేష్.

'2.O' లో ఐశ్వర్యా రాయ్!?

సూపర్ స్టార్ రజనీకాంత్, అందాల తార ఐశ్వర్యా రాయ్ జంటగా నటించిన చిత్రం ‘రోబో’.

వచ్చాడయ్యో సామి.. 'భరత్‌ అనే నేను' మూడో పాట విడుదల

మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'.