Devara:ఎన్టీఆర్ ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ పండుగ బరిలో..

  • IndiaGlitz, [Friday,February 16 2024]

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో పాన్ ఇండియా చిత్రంగా 'దేవర' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తామని మేకర్స్ తొలుత ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం అవుతుండటం, VFX వర్క్ చాలా ఉండటంతోనే మూవీ విడుదలను వాయిదా వేసినట్లు వార్తలు జోరందుకున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై మూవీ యూనిట్ స్పందిస్తూ కొత్త విడుదల తేదీని ప్రకటించింది.

దసరా పండుగ కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ఓ కొత్త పోస్టర్ విడుదల చేసింది. కానీ ఈ కొత్త తేదీపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏమో తమ హీరోను థియేటర్లలో చూడటానికి ఇంకా అక్టోబర్ నెల దాకా ఆగాలా అని నిరుత్సాహపడుతున్నారు. మరికొంతమంది ఏమో ఫైనల్‌గా రిలీజ్ డేట్ కన్ఫార్మ్ అయిందని సంతోషిస్తున్నారు. మొత్తానికి పండుగ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడానికి తారక్ సిద్ధమయ్యాడు అంటున్నారు.

కాగా RRR వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండటం, అలనాటి సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తొలిసారిగా ఎన్టీఆర్ సరసన కనిపించనున్నారు. మరోవైపు కథకు ఉన్న డిమాండ్ దృష్ట్యా సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నామని చెప్పడంతో మరింత హైప్ ఏర్పడింది.

ఇప్పటివరకు మూవీ నుంచి విడుదలైన పోసర్లు, గ్లింప్స్ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో ఈ సముద్రం చేపలు కంటే కత్తుల్ని, నెత్తురునే ఎక్కువ చూసుండాది. అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అన్నారు అంటూ తారక్ చెప్పిన డైలాగ్ సూపర్బ్‌గా ఉంది. మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుథ్ రవిచంద్రన్ అందించిన బీజీఎం అయితే గూస్‌బంప్స్ తెప్పించింది. దీంతో సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ నుంచి వస్తున్న 'దేవర' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

More News

Rashmika:నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. రష్మికకు రౌడీ బాయ్ విషెస్..

'పుష్ప', 'యానిమల్' సినిమాలతో నేషనల్ క్రష్ రష్మిక మందన్న దేశవ్యాప్తంగా యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది.

Allu Arjun's Uncle:కాంగ్రెస్ పార్టీలోకి అల్లు అర్జున్ మామ.. ఎంపీగా పోటీ..?

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి బోల్తాపడిన గులాబీ పార్టీకి..

Women Cricketers:మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్ హెడ్‌కోచ్‌పై వేటు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే హెచ్‌సీఏ తాజాగా మహిళల క్రికెటర్లపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోంది.

Rajadhani Files:‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

‘రాజధాని ఫైల్స్‌’(Rajadhani Files) సినిమా విడుదలకు ఆటంకం తొలగిపోయింది. మూవీ రిలీజ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Pawan:కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం అలాగే కూలిపోతుంది: పవన్

కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం చివరికి కూలిపోతుంది అని జనసేనాని తెలిపారు. విజయవాడలో "విధ్వంసం"