close
Choose your channels

రికార్డ్ క్రియేట్ చేసిన తార‌క్ అభిమానులు!!

Thursday, May 21, 2020 • తెలుగు Comments

రికార్డ్ క్రియేట్ చేసిన తార‌క్ అభిమానులు!!

అగ్ర హీరోలు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్‌తో దుమ్మురేపుతుంటే వారి అభిమానులు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. అస‌లే క‌రోనా టైమ్ కావ‌డంతో హీరోలు, అభిమానులు సోష‌ల్ మీడియాలో ఎక్కువ స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. స్టార్ హీరోల‌కు సంబంధించిన బ‌ర్త్ డేలు, హిట్ సినిమా రిలీజ్ డేట్‌లు వ‌స్తే.. హ్యాష్ ట్యాగ్‌ల‌తో సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా తార‌క్ అభిమానులు అలాంటి రికార్డుని ఒక దాన్ని సోష‌ల్ మీడియాలో క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ పుట్టిన‌రోజు మే 20 సంద‌ర్భంగా హ్యాష్ ట్యాగ్‌తో వ‌రుస ట్వీట్స్ చేశారు తారక్ అభిమానులు. 21.5 మిలియ‌న్ ట్వీట్స్‌తో తార‌క్ అభిమానులు ట్విట్ట‌ర్‌లో ఓ రికార్డ్ క్రియేట్ చేసిన‌ట్లు సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రెండు భారీ సినిమాలు చేస్తున్నారు. అందులో ఒక‌టి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్‌తో క‌లిసి ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రో సినిమా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సి ఉంది. ట్రిపుల్ ఆర్ ముగిసిన త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో సినిమా స్టార్ట్ చేస్తారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగానే ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌టంతో తార‌క్ అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz