close
Choose your channels

ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ

Tuesday, October 22, 2019 • తెలుగు Comments

ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ

టాలీవుడ్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం `RRR` . యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఈ భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్ సినిమా రూపొందుతుంది. కాగాఈ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ వీరుడు కొమురంభీమ్‌గా న‌టిస్తుంటే.. చ‌ర‌ణ్ ఆంధ్ర మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్నారు. కాగా మంగ‌ళ‌వారం కొమురం భీమ్ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా `RRR` యూనిట్ ఎన్టీఆర్ లుక్‌ని విడుద‌ల చేస్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ యూనిట్ మాత్రం ఓ ట్వీట్‌ను మాత్ర‌మే చేసింది.

``తెలంగాణ‌కు చెందిన గొప్ప పోరాట యోధుడు కొమురం భీమ్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న్ని గుర్తు చేసుకుంటున్నాం. మా `RRR` లో కొమురం భీమ్‌గా న‌టిస్తున్న తార‌క్‌ను వెండితెర‌పై  చూపించ‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం`` అంటూ మెసేజ్ చేశారు.

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్, కోలీవుడు న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. రామ‌రాజు జోడి సీత పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న హీరోయిన్‌గా ఎమ్మారాబ‌ర్ట్స్ న‌టిస్తుంద‌ని స‌మాచారం. ఇద్ద‌రు విప్ల‌వ నాయ‌కుల‌కు సంబంధించిన క‌ల్పిత‌గాథే ఈ చిత్రం. `బాహుబ‌లి` త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న చిత్రం కావ‌డంతో అంద‌రిలో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz