రాజ‌మౌళిని క‌లిసిన ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్‌

  • IndiaGlitz, [Monday,October 22 2018]

బాహుబ‌లి త‌ర్వాత రాజమౌళి త‌దుప‌రి చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు త‌గిన విధంగా రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్‌తో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి స్టార్ హీరోల‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

అందులో భాగంగా ఎన్టీఆర్ ఫిజిక‌ల్ ట్రైల‌ర్ లాయిడ్స్ స్టీవెన్స్ ఈరోజు రాజ‌మౌళిని క‌లిసి ఎన్టీఆర్ లుక్ గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించాడు. ఇప్పుడు రాజ‌మౌళి, లాయిడ్ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

డి.వి.వి.దాన‌య్య నిర్మాణంలో స్టార్ట్ కాబోయే ఈ సినిమా డిసెంబ‌ర్‌లో ప్రారంభం అవుతుంది. 2020లో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు.