క‌న్న‌డ ఎంట్రీకి సిద్ధ‌మైన ఎన్టీఆర్ హీరోయిన్‌...

  • IndiaGlitz, [Monday,October 01 2018]

అ!. అమీతుమీ, బ్రాండ్ బాబు చిత్రాల్లో న‌టించి మెప్పించిన ఈషా రెబ్బా ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చిత్రం 'అర‌వింద స‌మేత‌'లో న‌టిస్తుంది. ఈ అమ్మ‌డు క‌న్న‌డ చిత్ర సీమ‌లోకి రంగ ప్ర‌వేశం చేయ‌నుంది. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్ కుమార్ ఓ చిత్రంలో న‌టించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోయే ఈ చిత్రంలో ఈషా రెబ్బా కాలేజ్ లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

ల‌క్కీ గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందబోయే ఈ సినిమాను కిర‌ణ్ నిర్మిస్తారు. కిరిక్ పార్టీ, నన్నుదోచుకుందువ‌టే చిత్రాలకు సంగీతాన్ని అందించిన అజ‌నీశ్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌నున్నారు. తెలుగులో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపు సాధించుకుంటున్న త‌రుణంలోనే ఈషా క‌న్న‌డ ఎంట్రీ ఆమెకు మ‌రింత ప్ల‌స్ కానుంది.

More News

'అంత‌రిక్షం' షూటింగ్ పూర్తి...

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతోన్న సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ 'అంత‌రిక్షం'. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన 'ఘాజీ'కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ సంకల్ప్ రెడ్డి..

'బంగారి బాలరాజు' అక్టోబర్ 25న విడుదల

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా కె.యమ్ డి. రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు".

'భలే మంచి చౌక బేరమ్‌' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌

శ్రీసత్యసాయి ఆర్ట్స్‌, కె.కె.రాధామోహన్‌ సమర్పణలో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై మురళీక ష్ణ ముడిదాని దర్శకత్వంలో

ప్రయత్నం సినిమా ప్రెస్  మీట్

అభయ్ ప్రొడక్షన్ పతాకం పై విశాఖపట్నం లోని నూతన నటీనటులతో ధనుంజయ్, హ్రితిక సింగ్ హీరో హీరోయిన్ గా దినేష్ పి దర్శకత్వం లో నిర్మించిన సినిమా 'ప్రయత్నం'.

స‌వ్య‌సాచి టీజ‌ర్ విడుద‌ల‌.. 

నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న స‌వ్య‌సాచి టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చాలా స్టైలిష్ గా.. కొత్త‌గా యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగింది.