close
Choose your channels

పెళ్లి చేసుకుంటున్నఎన్టీఆర్ హీరోయిన్..

Wednesday, March 2, 2016 • తెలుగు Comments

అవును...ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుంది. ఇంత‌కీ ఎన్టీఆర్ హీరోయిన్ ఎవ‌ర‌ని ఆలోచిస్తున్నారా..?  లాహిరి లాహిరి లాహిరిలో...మ‌న‌సు మాట విన‌దు, సింహాద్రి చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నహీరోయిన్ అంకిత‌.  చాలా రోజులుగా  సినిమాల‌కు దూరంగా ఉన్న అంకిత‌ ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, జెపి మోర్గ‌న్ వైస్ ప్రెసిడెంట్, ఛైర్మెన్ విశాల్ జ‌గ్ తాప్ ను అంకిత పెళ్లి చేసుకోబోతుంది. ఈనెల 28న ముంబైలో వీరిద్ద‌రి వివాహాం గ్రాండ్ గా జ‌ర‌గ‌నుంది. ఈ వివాహా వేడుక‌కు ప‌లువురు సినీతార‌లు హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం.