'య‌న్‌.టి.ఆర్' రెండోభాగం విడుద‌ల క‌న్‌ఫ‌ర్మ్ చేశారు.

  • IndiaGlitz, [Wednesday,December 19 2018]

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అనే రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ రెండు భాగాల్లో 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. కాగా 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతుంది. ఈ శుక్ర‌వారం ఆడియో విడుద‌ల‌వుతుంది. ఈ రెండు భాగాల్లో 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' సినిమా జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది.

రెండో భాగం 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు'ని జ‌న‌వ‌రి 24న విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. అయితే అప్ప‌టికీ మొద‌టి భాగం విడుద‌లై మూడు వారాలే అయ్యుంటుంది. కాబ‌ట్టి డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి వ‌ర్కవుట్ కాద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెప్ప‌డంతో ద‌ర్శ‌క నిర్మాతలు రెండో భాగాన్ని ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేయడానికి నిర్ణ‌యం తీసేసుకున్నారు. విడుద‌ల వాయిదా ప‌డుతుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే అధికారికంగా యూనిట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

More News

బాల‌కృష్ణ‌ను గొకుతున్న వ‌ర్మ‌...

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌, త‌న‌కు వ్య‌తిరేకంగా జ‌రిగే విష‌యాన్ని ఓ ప‌ట్టాన వ‌దిలిపెట్ట‌డు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను వ‌ర్మే తెర‌కెక్కిస్తాడ‌ని ముందుగా వార్తలు వినిపించాయి.

ప్రేమ గురించి స్ప‌ష్టం చేసిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే

తెలుగు, హిందీ సినిమాల్లో న‌టిస్తున్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే.. న‌టి కిమ్ శ‌ర్మ‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు చాలా రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపించాయి.

ఈ పదేళ్ళ జర్నీలో చాలా ఎత్తు పల్లాలు చూసాను - తనీష్

బాల నటుడిగా పరిచయం అయిన తనీష్  హీరోగా పదేళ్ళ మైలురాయిని దాటుతున్న సందర్భంగా  మీడియాతో ముచ్చటించారు. నచ్చావులే విడుదలయి ఈ రోజు(19.12.18) కి పదేళ్ళు పూర్తయ్యింది.

విశాల్‌ పై తిరుగుబాటు

త‌మిళ హీరో విశాల్  నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడిగా.. న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కూడా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో నిర్మాత‌ల సంఘం విష‌యానికి వ‌స్తే విశాల్‌పై వ్య‌తిరేక‌త నెల‌కొంది.

'పేట్ట'తెలుగు విడుద‌ల పై రెండు తేదీలు..

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ 165వ చిత్రం 'పేట్ట‌'. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిస్తుంది.