మీ గ‌డ‌ప‌ల‌కు పసుపునై బ్ర‌త‌కడానికి వ‌చ్చాను

  • IndiaGlitz, [Saturday,February 16 2019]

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జీవిత‌క‌థ‌ను 'య‌న్‌.టి.ఆర్‌' బ‌యోపిక్‌గా రూపొందించారు. అందులో ఆయ‌న సినీ జీవితాన్ని 'య‌న్.టి.ఆర్ క‌థానాయ‌కుడు'గా జ‌న‌వ‌రి 9న  విడుద‌ల చేశారు. కాగా ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయ కోణాన్ని 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అంటూ ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌ల చేయ‌బోతున్నారు. నేడు మ‌హానాయ‌కుడుకి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌లైంది. 2 నిమిషాల 18 సెక‌నుల పాటు ట్రైల‌ర్ ఉంది. ఇందులో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీకి సంబంధించిన చిహ్నాన్ని సిద్ధం చేయ‌డం.. ఖాకి దుస్తులు వేసుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం అన్నీ చూపించారు. ఇందిరా గాంధీ పాత్ర‌ధారి శ్రీ కృష్ణ‌పాత్ర‌ధారిగా ఉన్న ఎన్టీఆర్‌ను చూస్తూ జై శ్రీకృష్ణ అంటూ న‌మ‌స్కారం చేయ‌డాన్ని ఇందులో చూపించారు. ఆమెతో పాటు ఉన్న మ‌రో నాయ‌కుడు మేడ‌మ్ ఆయ‌న మ‌న ప్ర‌త్య‌ర్థ పార్టీ అని చెప్ప‌డం.. చూపించారు. ఎన్టీఆర్ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం, ప్రచారం చేయ‌డం, రోడ్ల‌పైనే స్నానాలు చేయ‌డం చూపించారు.

ఓడిపోతే ల‌డ్డులు ఏంట‌య్యా అంటే.. మా అక్క చెప్పింది. మొద‌టి సినిమా స‌రిగ్గా ఆడ‌లేదంటా!.. త‌ర్వాత సినిమా నుండి తిరుగులేదంట‌..

ఇచ్చిన ప్ర‌తి మాట నిల‌బ‌డాలి.. చేసిన ప్ర‌తి ప‌ని క‌న‌ప‌డాలి.. ఇన్ టైం, ఆన్ డోర్‌

ఆయ‌న పైల‌ట్ అయితే, నేను కో పైలట్‌.. ఆడ్మిన‌స్ట్రేష‌న్‌కి ఆయ‌న కొత్త క‌దా! అని నాదెండ్ల భాస్క‌ర్‌రావు పాత్ర‌ధారి చెప్ప‌డం.. 

చెప్పేటోడుండాలి.. లేకుంటే ఆరు కోట్ల మంది ఆయ‌న ప‌క్క‌నున్నా, ఒంట‌రోడైపోతాడు.. 

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం.. ఇద్ద‌రూ ప్ర‌శాతంగా వెళ్లిరండి.. ఈ రాజ‌కీయం నాకు వ‌దిలేయండి.. 

ఆయ‌న ఢిల్లీ వ‌స్తే నేనేం చేయ‌గ‌ల‌ను..

పార్టీకి పెద్దాయ‌న గ్లామ‌రే అనుకో.. కానీ గ్రామ‌ర్ నేను..

నిశ్శ‌బ్ధాన్ని చేత‌గానిత‌నం అనుకోవ‌ద్దు.. మౌనం మార‌ణాయుధంతో స‌మాన‌మ‌ని మ‌ర‌చిపోవ‌ద్దు.. నేను రాజ‌కీయాలు చేయ‌డానికి రాలేదు.. మీ గ‌డ‌ప‌ల‌కు

ప‌సుపు నై బ్ర‌త‌కడానికి వ‌చ్చాను...

వంటి భారీ డైలాగ్స్ మెప్పిస్తున్నాయి. 

నాదెండ్ల భాస్క‌ర్‌రావు పాత్ర‌ధారి ఎన్టీఆర్ నుండి ప‌ద‌వి లాక్కోవడం.. త‌ర్వాత ఎన్టీఆర్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఏం చేశార‌నే విష‌యాల‌ను ఈ ట్రైల‌ర్‌లో చూపిస్తూ వ‌చ్చారు. 

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టించార‌. ఎన్‌.బి.కె.ఫిలింస్‌, వారాహి చ‌ల‌న‌చిత్రం, విబ్రి మీడియా ప‌తాకాల‌పై నంద‌మూరి వ‌సుంధ‌రా దేవి, నంద‌మూరి బాల‌కృష్ణ  చిత్రాన్ని నిర్మించారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. సినిమా ఫిబ్ర‌వరి 22న విడుద‌ల కానుంది. 

More News

ర‌ష్మీ బూతులు

గురువారం శ్రీన‌గ‌ర్ పుల్వామాలో భార‌త ద‌ళాల‌పై జ‌రిగిన తీవ్ర‌వాద దాడుల్లో 40 మంది జ‌వాన్లు ప్రాణాలు విడిచారు.

'మ‌న్మ‌థుడు' కోసం ఇద్దరు....

అక్కినేని నాగార్జున ఇప్పుడు రెండు సీక్వెల్స్‌ను సెట్స్‌కు తీసుకెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. వాటిలో ముందుగా 'మ‌న్మ‌థుడు' సీక్వెల్ 'మ‌న్మ‌థుడు 2', 'సొగ్గాడే చిన్నినాయ‌నా' సీక్వెల్ 'బంగార్రాజు'.

కబాలి'కి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఆసియా

ఒక సాధారణ బస్సు కండక్టర్ నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్‌ను యావత్ ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు.

వాట్సాప్‌‌లో సరికొత్త ఫీచర్.. అంతా మీ ఇష్టమే

వాట్సాప్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పటికే పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ వినియోగదారులను రోజురోజుకు పెంచుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే.

జయరామ్ మృతదేహాన్ని చూసి పరుగులు తీశారు!

ప్రముఖ ఎన్నారై, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ హత్యకేసులో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. మొదట ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా రాకేశ్ రెడ్డిని పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే.