ఎన్టీఆర్ - పూరి మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Tuesday,September 27 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ మూవీతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించిన విష‌యం తెలిసిందే. అయితే... ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రం పూరి జ‌గ‌న్నాథ్ తో ఉంటుంద‌ని మేము జ‌న‌తా గ్యారేజ్ రిలీజ్ రోజే చెప్ప‌డం జ‌రిగింది. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ డైరెక్ట‌ర్ అనిల్ రవిపూడి, లింగు స్వామి క‌థ‌లు విన్నాడు పూరితో సినిమా ఉండ‌క‌పోవ‌చ్చు అంటూ ప్ర‌చారం జ‌రిగింది కానీ మేము చెప్పిందే నిజం అవుతుంది అని తెలిసింది. మాకు అందిన తాజా స‌మాచారం ప్ర‌కారం..ఇటీవ‌ల ఎన్టీఆర్ బ్యాకాంక్ వెళ్లారట‌. అక్క‌డ పూరి ఎన్టీఆర్ కి ఫుల్ స్ర్కిప్ట్ వినిపించారు.
క‌థ విని ఎన్టీఆర్ పూరికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఎన్టీఆర్ - పూరి కాంబినేష‌న్లో రూపొందే ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌నున్నారు. ఈ మూవీ కోసం ఫిల్మ్ ఛాంబ‌ర్ లో బాక్స‌ర్ అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేసారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ లోనే చేయ‌డానికి ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంది. అది ఏమిటంటే...ఎన్టీఆర్ ల‌క్కీ నెంబ‌ర్ 9. ఇప్పుడు ఎన్టీఆర్ చేయ‌నున్న మూవీ 27వ సినిమా. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ కి ఇది 9వ సినిమా అవుతుంది. అందుక‌నే ఈ మూవీని సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్స్ బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్, కె.ఎస్.రామారావు నిర్మిస్తామ‌ని ముందుకు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ లోనే చేస్తున్నారు యంగ్ టైగ‌ర్..!

More News

14 రీల్స్ సంస్థ గర్వంగా అందిస్తున్న చిత్రం హైపర్ - నిర్మాత అనిల్ సుంకర

ఎనర్జిటిక్ హీరో రామ్-కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ హైపర్.ఈ చిత్రంలో రామ్ సరసన రాశీ ఖన్నా నటించింది.

'బాహుబలి2' ట్రైలర్ రిలీజ్ డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న బాహుబలి పార్ట్ 2 బాహుబలి ది కన్ క్లూజన్ 2017 ఏప్రిల్ లో

రీమేక్ లో సమంత, చైతు...?

ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం 'టు స్టేట్స్' (2014)ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే

'హైపర్ ' సెన్సార్ పూర్తి...

ఎనర్జిటిక్ స్టార్ రామ్,టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో వెంకట్ బోయినపల్లి సమర్పణలో

శతమానంభవతి సెట్ లో సెల్పీ సందడి..!

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం శతమానంభవతి.