'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, చరణ్ కొట్టుకుంటే?

'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కొట్టుకుంటారా? ఇద్దరి మధ్య భారీ ఫైట్ ఉందా? అంటే... దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, రచయిత వి. విజయేంద్రప్రసాద్ చెప్పిన మాటలు వింటే 'అవును' అని ఎవరైనా అంటారు. హీరోలు ఇద్దరూ కొట్టుకుంటే ప్రేక్షకులు కంటతడి పెడతారని ఆయన చెప్పారు.

'ఆర్ఆర్ఆర్'లో ఒక ఫైట్ సీన్ ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తుందని వి. విజయేంద్రప్రసాద్ వివరించారు. 'ఆలీతో జాలీగా' ప్రోగ్రాం లో ఫైట్ సీన్ గురించి అడిగారు.

ఇదీ చదవండి: రెండు సార్లు ఛాన్స్ మిస్.. టాలీవుడ్ స్టార్ హీరోపై ప్రియమణి

జనరల్ గా మనం ఫైట్ చూస్తుంటే... విలన్ ను కొట్టు, నరుకు అంటుంటాం. ఇద్దరు మంచి వాళ్ళు కొట్టుకుంటుంటే ఎవరి పక్షాన ఉంటాం? ఇద్దరు కుమారులు కొట్టుకుంటుంటే... తల్లి ఎవరి పక్షాన ఉంటుంది? 'కొట్టుకోవద్దు' అని ఏడుస్తుంటుంది. అదేవిధంగా ఇద్దరు సూపర్ స్టార్లు కొట్టుకుంటుంటే ప్రేక్షకులకు కన్నీళ్లు వస్తాయి. ఇద్దరు మంచి వాళ్ళు. పరిస్థితుల ప్రభావం వల్ల కొట్టుకుంటారు. పప్పులు మనకు ఏడుపు వస్తుంది అని విజయేంద్రప్రసాద్ చెప్పారు.

చూసేది సినిమా అని, ఇద్దరూ మళ్ళీ కలుస్తారని తెలిసినా... కంటతడి పెట్టుకున్నానని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.  థియేటర్లో చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తుందని అన్నారు. ఎన్నిసార్లు చూసినా ఆ క్షణానికి అదే అనుభూతి వస్తుందని ఆయన అన్నారు.

More News

మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంక్స్ పై ఎమ్మెల్యే కామెంట్

కరోనా సమయంలో తన వంతు భాద్యతగా మెగాస్టర్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆర్థిక సహాయాలు, విరాళాలు ఇలా ఎన్నో విధాలుగా

బాలయ్యకు కోపం ఎక్కువే.. ఖైదీ, సైరా మధ్యలో ఏం జరిగిందంటే..

తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ పేరు చెప్పగానే ముత్తు, నరసింహ, దశావతారం, స్నేహం కోసం లాంటి సెన్సేషనల్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. తమిళంలో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు

రెండు సార్లు ఛాన్స్ మిస్.. టాలీవుడ్ స్టార్ హీరోపై ప్రియమణి

వివాహం తర్వాత ప్రియమణి సినిమాల జోరు తగ్గించింది. బుల్లితెర షోలలో కనిపిస్తోంది. ప్రియమణి తెలుగులో నటించి చాలా కాలమే అవుతోంది.

బుర్రిపాలెంలో మహేష్ బాబు వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో సెలెబ్రిటీలు తమ వంతుగా ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

మాస్ స్టామినా ఇది.. కళ్ళు చెదిరే రికార్డ్ రామ్ సొంతం!

యువ హీరోల్లో రామ్ స్పెషల్ స్కిల్స్ ఉన్న నటుడు. డాన్సులు, నటన, ఫైట్స్ ఇలా ఏదైనా అదరగొట్టేస్తాడు. అందుకే రామ్ ని అభిమానులు ఎనెర్జిటిక్ హీరో అని పిలుచుకుంటారు.