'జై లవకుశ' తో ఎన్టీఆర్ రికార్డులు

  • IndiaGlitz, [Tuesday,September 12 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం 'జై ల‌వ‌కుశ‌'. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌కుడు. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌లో ఎన్టీఆర్ మూడు పాత్ర‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ట్రైల‌ర్ కూడా స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూంది.

ట్రైల‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లోనే 7.24 మిలియ‌న్ డిజిట‌ల్ వ్యూస్‌ను రాబ‌ట్టకుంది. బాహుబ‌లి త‌ర్వాత తెలుగులో రికార్డు స్థాయిలో డిజిట‌ల్ వ్యూస్‌ను రాబట్టుకున్న చిత్రంగా జై ల‌వ‌కుశ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ విష‌య‌మై ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కు థాంక్స్ చెప్పారు. అంతే కాకుండా అభిమానుల‌ను సంతోష పెట్టేలా క‌ష్ట‌ప‌డి సినిమాలు చేస్తాన‌ని అన్నారు.

More News

విశాల్ 'విల‌న్‌' గా వ‌చ్చేస్తున్నాడు..

తెలుగు, త‌మిళ చిత్రాలతో త‌న కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్‌. ఇప్పుడు మ‌ల‌యాళంలో కూడా న‌టించ‌బోతున్నాడు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తున్న చిత్రం విల‌న్‌లో విశాల్ విల‌న్‌గా క‌న‌ప‌డ‌నున్నాడ‌నేది తెలిసిందే.

'జవాన్' రిలీజ్ డేట్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా బివిఎస్ రవి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జవాన్'.

కుంభకోణంలో బాలకృష్ణ 102 సినిమా షూటింగ్

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై

రెహ‌మాన్‌లాగే అలాగే హిట్ కొడ‌తాడా?

డ‌బుల్ ఆస్కార్ అవార్డుల‌ను కైవ‌సం చేసుకున్న త‌రువాత కూడా ఎ.ఆర్‌.రెహ‌మాన్ కెరీర్‌లో ఓ వెలితి ఉండేది. అదేమిటంటే.. తెలుగులో ఆయ‌న నేరుగా చేసిన ఏ సినిమా కూడా హిట్ కాలేద‌న్న‌ది.

తాగుబోతుగా విజయ్ ఆంటోని?

నకిలీ,డా.సలీం,బిచ్చగాడు,బేతాళుడు,యమన్ చిత్రాలతో తెలుగువారికి దగ్గరైన విజయ్ ఆంటోని..