close
Choose your channels

అంతా తూచ్ అంటున్న ఎన్టీఆర్‌

Saturday, June 15, 2019 • తెలుగు Comments

అంతా తూచ్ అంటున్న ఎన్టీఆర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్‌` సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈయ‌న కీర్తిసురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించే సినిమా `స‌ఖి`(విన‌ప‌డుతున్న పేరు)లో గెస్ట్ అప్పియ‌రెన్స్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అందుకు కార‌ణంగా కీర్తి సురేష్ సినిమా నిర్మాత మ‌హేష్ కొనేరుతో ఉన్న అనుబంధ‌మే కార‌ణ‌మ‌ని వార్త‌ల్లో పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్ పి.ఆర్ టీం మాత్రం ఈ విష‌యాన్నిలైట్‌గా తీసుకుంది. సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్ గెస్ట్ అప్పియ‌రెన్స్‌పై వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని తేల్చేశారు.

`ఆర్ ఆర్ ఆర్‌`లో ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమ‌రం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇందులో అల్లూరి సీతారామ‌రాజుగా క‌న‌ప‌డ‌తారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జూలై 30న విడుద‌ల‌వుతుంది. 

Get Breaking News Alerts From IndiaGlitz