ఎన్టీఆర్ సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది

  • IndiaGlitz, [Saturday,September 23 2017]

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం జైల‌వ‌కుశ మంచి క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. రెండు రోజుల్లో రూ.60 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఓవ‌ర్‌సీస్‌లో ఇప్ప‌టికే మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లోకి చేరింది. ఈ చిత్రంలోని జై పాత్ర‌లో తార‌క్ న‌ట విశ్వ‌రూపం చూపించాడు.

ఇదిలా ఉంటే.. జై ల‌వ‌కుశతో ఎన్టీఆర్‌కి ఉన్న ఓ సెంటిమెంట్ బ‌ల‌ప‌డిన‌ట్ల‌య్యింది. ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏమిటంటే.. సెప్టెంబ‌ర్‌లో ఆయ‌న చిత్రాలు విడుద‌లైతే విజ‌యం సాధిస్తాయి. తార‌క్ కెరీర్‌లో మొద‌టి హిట్ చిత్రం అయిన స్టూడెంట్ నెం.1 సెప్టెంబ‌ర్‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

అలాగే తార‌క్ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌లో ఒక‌టైన జ‌న‌తా గ్యారేజ్ కూడా గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లోనే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇప్పుడు జైల‌వ‌కుశ కూడా సేమ్ సెప్టెంబ‌ర్‌లో రిలీజై కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. మొత్తానికి సెప్టెంబ‌ర్ ఎన్టీఆర్‌కి బాగా క‌లిసొచ్చిన‌ట్టే లెక్క‌.

More News

నారా రోహిత్ 'బాలకృష్ణుడు' ఫస్ట్ లుక్ విడుదల

సరస్ చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్,మాయా బజార్ మూవీస్ పతాకాలపై విలక్షణ నటుడు నారా రోహిత్,

మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకున్న హార‌ర్ కామెడీ 'వ‌స్తా'

భానుచంద‌ర్‌, జీవా, అదిరే అది, ఫ‌ణి ప్ర‌ధాన తారాగ‌ణంగా మెట్రో క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందుతోన్న సినిమా 'వ‌స్తా'. జంగాల నాగ‌బాబు ద‌ర్శ‌కుడు. ద‌మిశెల్లి రవికుమార్, మొహ్మ‌ద్ ఖ‌లీల్ నిర్మాత‌లు. హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం మొద‌టి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా...

మళ్లీ సంగీత దర్శకుడుతోనే..

18 ఏళ్ల క్రితం విడుదలై మ్యూజికల్ హిట్ అయిన శీను(వెంకటేష్ హీరో)చిత్రం ద్వారా తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు శశి.

నాని.. వారితోనే ఆరు వరుస సినిమాలు

భలే భలే మగాడివోయ్ నుంచి నిన్ను కోరి వరకు వరుసగా ఆరు విజయాలను సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని.

'దళపతి' పాటలు విడుదల

రాజ్యానికి రాజెంత ముఖ్యమో,ఆ రాజును,ప్రజలను,చుట్టు ఉన్నవారికి కాపాడే దళపతి కూడా అంతే ముఖ్యం.