ల‌క్కీ నెంబ‌ర్ కోసం ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టిన హీరో..

  • IndiaGlitz, [Saturday,April 16 2016]

సెంటిమెంట్ అనేది ఒక్కొక్క‌రికి ఒక్కొలా ఉంటుంది. ఒక‌రికి గురువారం సెంటిమెంట్ అయితే...మ‌రొక‌రికి శుక్ర‌వారం సెంటిమెంట్ గా ఉంటుంది. సామాన్యుల‌కే సెంటిమెంట్ ఇలా ఉంటే..సినిమా వాళ్ల‌కు సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. ఒక హీరోకి మూడ‌క్ష‌ర టైటిల్ సెంటిమెంట్ అయితే...మ‌రో హీరోకి డిసెంబ‌ర్ నెల సెంటిమెంట్.

ఇక‌ అసలు విష‌యానికి వ‌స్తే...ల‌క్కీ నెంబ‌ర్ కోసం ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టాడో హీరో. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..? య‌ంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. అవును ఇది నిజం. ఎన్టీఆర్ కి 9999 సిరీస్ నెంబ‌ర్ అంటే సెంటిమెంట్. అందుక‌నే ఎన్టీఆర్ వెహికిల్స్ అన్నింటికి 9999 నెంబ‌రే ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ బి.ఎం.డ‌బ్ల్యూ 7 సిరీస్ వెహికిల్ కి ల‌క్కీ నెంబ‌ర్ 9999 కోసం అక్ష‌రాల 11 ల‌క్ష‌లు చెల్లించి ల‌క్కీ నెంబ‌ర్ 9999 ను ద‌క్కించుకోవ‌డం విశేషం.

More News

విశాల్‌ హీరోగా వస్తోన్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా, శ్రీదివ్య హీరోయిన్‌గా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ప‌వ‌న్ న్యూమూవీ టైటిల్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజైంది. ఇక ప‌వ‌న్ నెక్ట్ మూవీ ఏమిటి..? ఈసారి ఎలాంటి మూవీ చేయ‌నున్నాడు అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న టైంలో త‌న‌ నెక్ట్స్ మూవీ గురించి క్లారిటీ ఇచ్చేసాడు.

చైతు సినిమా రెడీ

యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఏమాయ చేసావే సినిమా త‌ర్వాత చైతు, గౌత‌మ్ క‌ల‌సి చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

నితిన్ని టెన్ష‌న్ పెడుతున్న సూర్య‌..

యువ హీరో నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం అ ఆ.  నితిన్, స‌మంత జంట‌గా న‌టిస్తున్న అ ఆ టీజ‌ర్ ఇటీవ‌ల రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ కి మంచి రెస్పాన్స్ ల‌భించింది.

ఫ్లాప్ మూవీతో న్యూరికార్డ్..

ఫ్లాప్ మూవీతో న్యూరికార్డ్...అంటున్నారు. ఇంత‌కీ ఆ ఫ్లాప్ మూవీ ఏమిటి..? ఆ సినిమా సాధించిన రికార్డ్ ఏమిటి..? అంటారా..? ఆ మూవీ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన‌ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే స‌ర్ధార్ ఫ్లాప్ అంటూ టాక్ వ‌చ్చేసింది.