close
Choose your channels

ఫ్యాన్సీ నంబర్ కోసం అక్షరాల రూ.17 లక్షలు ఖర్చుపెట్టిన ఎన్టీఆర్

Thursday, September 23, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫ్యాన్సీ నంబర్ కోసం అక్షరాల రూ.17 లక్షలు ఖర్చుపెట్టిన ఎన్టీఆర్

సినిమాలో కంటెంట్, కటౌట్స్ సంగతి ఎలా ఉన్నా సెంటిమెంట్స్‌ను పక్కాగా ఫాలో అవ్వడం సినీపరిశ్రమలో కామన్. ఓపెనింగ్ డేట్ మొదలు రిలీజ్ డేట్ వరకూ ప్రతీ విషయంలోనూ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు సినీజనాలు. ఇక సక్సెస్ కోసం తమ అసలు పేరు పక్కనపెట్టి అద్దె పేరుతో విజయాలు వెతుక్కునే తారల సంగతి సరేసరి. కొన్నాళ్లుగా తమ పేరులోనే ఇంగ్లీష్ అక్షరాలు మార్చుకుంటూ న్యూమరాలజీని ఆశ్రయిస్తున్నారు పలువురు సినీసెలబ్రిటీస్. ఇప్పుడిక ఈ న్యూమరాలజీ సెంటిమెంట్ సినిమా టైటిల్‌ను కూడా వదలడం లేదట.

ఇటీవల తెలుగు సినిమాల టైటిల్స్‌లో న్యూమరాలజీ ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తెలుగు టైటిల్స్ రెగ్యులర్ గానే ఉన్నప్పటికీ ఇంగ్లీష్‌లో రాసినప్పుడు మాత్రం అధనపు అక్షరాలు కొన్ని వచ్చి చేరుతున్నాయి. ఇందుకు కారణం న్యూమరాలజీ సెంటిమెంటేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదేమో.

ఫ్యాన్సీ నంబర్ కోసం అక్షరాల రూ.17 లక్షలు ఖర్చుపెట్టిన ఎన్టీఆర్

ఇక యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కు కూడా ఒక సెంటిమెంట్ వుంది. అదే ‘‘9999’’ నెంబర్. ఈయన కార్ నెంబర్ 9999 ఉంటుంది. ఏ కొత్త కారు తీసుకున్నా కూడా దాని నెంబర్ మాత్రం ఇదే. దాంతో జూనియర్ ఎన్టీఆర్‌కు 9999 అనేది సెంటిమెంట్ అంటూ ప్రచారం జరిగింది. తన ప్రతీ కారుకు 9999 ఉండటంపై యంగ్ టైగర్ కూడా మొన్నామధ్య స్పందించాడు.

తనకు 9 అనే అంకె ఇష్టమని అలాగే .. తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు కారు నెంబర్‌ 9999 అని.. ఆ తర్వాత తన తండ్రి హరికృష్ట కూడా అదే వాడాడని.. అందుకే తనకు ఆ నెంబర్‌ అంటే ఇష్టమని ఎన్టీఆర్‌ చెప్పాడు. అందుకే రెండో ఆలోచన లేకుండా తన కొత్తగా ఏ కారు తీసుకున్నా అదే నెంబర్ కంటిన్యూ అవుతుందని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్.

ఫ్యాన్సీ నంబర్ కోసం అక్షరాల రూ.17 లక్షలు ఖర్చుపెట్టిన ఎన్టీఆర్

ఇక ఈ మధ్యే కోట్లు ఖర్చు పెట్టి లంబోర్ఘిని ఊరుస్‌ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్నాడు చిన్న రామారావు. కారు కోసమే కోట్లు పెట్టిన తారక్‌.. ఫ్యాన్సీ నెంబర్‌ కోసం లక్షలు వెచ్చించాడు. తాజాగా ఖైరతాబాద్‌ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లకు వేలం వేశారు. ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ.17 లక్షలు పెట్టి TS 09 FS 9999 నంబర్‌ దక్కించుకున్నాడు. గతంలోనూ తారక్‌ పది లక్షలు పెట్టి ఫ్యాన్సీ నంబర్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.